Aadamdu neevaadinatte annibanulanum jesu

ఆతఁడు నీవాడినట్టె అన్నిపనులనుఁ జేసు
Language

(॥పల్లవి॥)
ఆతఁడు నీవాడినట్టె అన్నిపనులనుఁ జేసు
శ్రీతరుణిని మమ్ము రక్షించవమ్మ

(॥ఆతఁ॥)
యేలవమ్మ మమ్మును యెక్కింతివి పతి వురము
నీలీల లేమి సేసినా నీకుఁజెల్లును
బాలకి వన్నిటా నీవు పనిగొంటి వాతనిని
కీలు నీచే నున్నది రక్షించవమ్మా

(॥ఆతఁ॥)
మన్నించవమ్మ మమ్ము మగఁడు నీచేతివాఁడు
సన్నల నీచేఁతలెల్లా సాగి వచ్చీని
అన్నిటాఁ జక్కనిదాన వటమీఁదట దొరవు
యెన్నికె కెక్కె నీబ్రదు కిఁకఁ గావవమ్మా

(॥ఆతఁ॥)
యీడేరించవమ్మ మమ్ము నిట్టె యలమేల్మంగవు
గూడితి శ్రీ వేంకటేశుఁ గోరినట్టెల్లా
యీడులేనిదానవు నే మూడిగాలవార మిదె
వేడుక లెల్లా నీసొమ్మే వెలయించవమ్మా

(||pallavi||)
ādam̐ḍu nīvāḍinaṭṭĕ annibanulanum̐ jesu
śhrīdaruṇini mammu rakṣhiṁchavamma

(||ādam̐||)
yelavamma mammunu yĕkkiṁtivi padi vuramu
nīlīla lemi sesinā nīgum̐jĕllunu
bālagi vanniḍā nīvu panigŏṁṭi vādanini
kīlu nīse nunnadi rakṣhiṁchavammā

(||ādam̐||)
manniṁchavamma mammu magam̐ḍu nīsedivām̐ḍu
sannala nīsem̐talĕllā sāgi vachchīni
anniḍām̐ jakkanidāna vaḍamīm̐daḍa dŏravu
yĕnnigĕ kĕkkĕ nībradu kim̐kam̐ gāvavammā

(||ādam̐||)
yīḍeriṁchavamma mammu niṭṭĕ yalamelmaṁgavu
gūḍidi śhrī veṁkaḍeśhum̐ gorinaṭṭĕllā
yīḍulenidānavu ne mūḍigālavāra midĕ
veḍuga lĕllā nīsŏmme vĕlayiṁchavammā