ఆతఁడు నీకంటె జాణఁ డదెఱఁగవా
(॥పల్లవి॥)
ఆతఁడు నీకంటె జాణఁ డదెఱఁగవా
యేతుల కిన్నిటానేల యెలయించేవే
(॥॥)
చెక్కునఁ జేయువెట్టుక సెలవుల నవ్వుకొంటా
వెక్కుసము లేమాడేవే విభునిని
చిక్కనిచెమట గార సిగ్గులనుఁ దొప్పఁ దోఁగి
చక్కనిమోమున నేమి సన్న సేసేవే
(॥॥)
పొదిగి తప్పక చూచి బొమ్మల జంకిచుకొంటా
కది మెంతవొరసేవే కాంతునిని
మదమున నుప్పొంగి మచ్చికల వెరగంది
పొదలుఁ జన్నుల నెంత పూఁచి మదిమేవే
(॥॥)
బిగువుఁ గాఁగిటఁ గూడి పిప్పిగాఁ బెనఁగుకొంటా
వెగటునేతురటె శ్రీ వేంకటేశుని
అగపడి చొక్కించి అలమేలుమంగవు నీవు
చిగురుమోవితేనె చిందించేవే
(||pallavi||)
ādam̐ḍu nīgaṁṭĕ jāṇam̐ ḍadĕṟam̐gavā
yedula kinniḍānela yĕlayiṁcheve
(||||)
sĕkkunam̐ jeyuvĕṭṭuga sĕlavula navvugŏṁṭā
vĕkkusamu lemāḍeve vibhunini
sikkanisĕmaḍa gāra siggulanum̐ dŏppam̐ dom̐gi
sakkanimomuna nemi sanna seseve
(||||)
pŏdigi tappaga sūsi bŏmmala jaṁkisugŏṁṭā
kadi mĕṁtavŏraseve kāṁtunini
madamuna nuppŏṁgi machchigala vĕragaṁdi
pŏdalum̐ jannula nĕṁta pūm̐si madimeve
(||||)
biguvum̐ gām̐giḍam̐ gūḍi pippigām̐ bĕnam̐gugŏṁṭā
vĕgaḍuneduraḍĕ śhrī veṁkaḍeśhuni
agabaḍi sŏkkiṁchi alamelumaṁgavu nīvu
sigurumovidenĕ siṁdiṁcheve