Aadamdu nee radulagu naasa seyamgaa

ఆతఁడు నీ రతులకు నాస సేయఁగా
Language

(॥పల్లవి॥)
ఆతఁడు నీ రతులకు నాస సేయఁగా
చేతులారా సేవ సేసి చిమ్మి రేఁచ వలదా

(॥ఆతఁ॥)
సెలవి నేమినవ్వేవే సిగ్గులేల పంచేవే
చెలిమిసేసి విభుఁడు చెక్కునొక్కఁగా
తలవంచుకొననేలే తమకమేల దాఁచేవే
కలికితనాల మతి కరఁగించవలదా

(॥ఆతఁ॥)
తొరలకేల లోఁగేవే తొంగి తొంగేమి చూచేవే
తెరయెత్తి యాతెండు నీదిక్కు చూడఁగా
సరియేమి వెనఁగేవే చన్నులేల మూసేవే
సరసముల నతని సాదించవలదా

(॥ఆతఁ॥)
మొక్కు లేల మొక్కేవే ముసుఁగేల వెట్టేవే
వొక్కటై శ్రీవేంకటేశుఁ డొడివట్టఁగా
గక్కన నెంత మెచ్చేవే కాఁగిట నెంత మించేవే
ఇక్కువలంటి నీగోర నెచ్చరించవలదా

(||pallavi||)
ādam̐ḍu nī radulagu nāsa seyam̐gā
sedulārā seva sesi simmi rem̐sa valadā

(||ādam̐||)
sĕlavi neminavveve siggulela paṁcheve
sĕlimisesi vibhum̐ḍu sĕkkunŏkkam̐gā
talavaṁchugŏnanele tamagamela dām̐seve
kaligidanāla madi karam̐giṁchavaladā

(||ādam̐||)
tŏralagela lom̐geve tŏṁgi tŏṁgemi sūseve
tĕrayĕtti yādĕṁḍu nīdikku sūḍam̐gā
sariyemi vĕnam̐geve sannulela mūseve
sarasamula nadani sādiṁchavaladā

(||ādam̐||)
mŏkku lela mŏkkeve musum̐gela vĕṭṭeve
vŏkkaḍai śhrīveṁkaḍeśhum̐ ḍŏḍivaṭṭam̐gā
gakkana nĕṁta mĕchcheve kām̐giḍa nĕṁta miṁcheve
ikkuvalaṁṭi nīgora nĕchchariṁchavaladā