(॥పల్లవి॥)
ఆతఁడు మొదలనే యనంగుఁడూ
రతి వసంత మిటు రాదు గదా
(॥ఆతఁడు॥)
కోమలిశిరసునఁ గూడెను యిప్పుడు
యేమిగారణముననో యీయలులు
ఆమనికుచముల నలబడి పుట్టెను
కామునిక వగతి గాదు గదా
(॥ఆతఁడు॥)
యితలఁ జెలిమో మింతయుఁ గైకొనె
కొత్తగ నయనచకోరములు
కుత్తికకోవిలకూఁతలు రేఁగెను
చిత్తజబలి మిటుచెడదుగదా
(॥ఆతఁడు॥)
కొమ్మజన్వనము కొల్లలు చేరెను
కమ్మర శ్రీవేంకేటపతికి
నెమ్మది నెంతయు నిలిపె నీతఁడే
యిమ్మడి మరుఁడయి యేఁచఁగదా
(||pallavi||)
ādam̐ḍu mŏdalane yanaṁgum̐ḍū
radi vasaṁta miḍu rādu gadā
(||ādam̐ḍu||)
komaliśhirasunam̐ gūḍĕnu yippuḍu
yemigāraṇamunano yīyalulu
āmanigusamula nalabaḍi puṭṭĕnu
kāmuniga vagadi gādu gadā
(||ādam̐ḍu||)
yidalam̐ jĕlimo miṁtayum̐ gaigŏnĕ
kŏttaga nayanasagoramulu
kuttigagovilagūm̐talu rem̐gĕnu
sittajabali miḍusĕḍadugadā
(||ādam̐ḍu||)
kŏmmajanvanamu kŏllalu serĕnu
kammara śhrīveṁkeḍabadigi
nĕmmadi nĕṁtayu nilibĕ nīdam̐ḍe
yimmaḍi marum̐ḍayi yem̐sam̐gadā