Aadamdu magamdu neegu nadivavu nee vaidi

ఆతఁడు మగఁడు నీకు నతివవు నీ వైతి
Language

(॥పల్లవి॥)
ఆతఁడు మగఁడు నీకు నతివవు నీ వైతి
చేతికి లోనై వుండితేఁ జిత్తము వచ్చుఁ గాక

(॥॥)
సరసము లాడితేనే చవులు వొడముఁ గాక
విరసము లాడితేను వెగటు గాదా
మరిగి పొందుసేసితే మనసు గరఁగుఁ గాక
వెరవు లే కలిగితే వెక్కసమై యుండదా

(॥॥)
ననుపులు చూపితేనే నగవులు వచ్చుఁగాక
పెనపులఁ జట్టి తేను ప్రియము లవునా
మనవులు చెప్పితేనే మచ్చికలు రేఁగుఁ గాక
అనువుకు మాటాడితే నందము లవునా

(॥॥)
సంతములై కూడితేనే సమ్మతౌఁగాక మన
పంతము లాడితేను పను లింపౌనా
యింతలో శ్రీ వేంకటేశుఁ డెనసె నన్నుఁదానే
సంతోసా లిటువంటివి సంగతులే కావా

(||pallavi||)
ādam̐ḍu magam̐ḍu nīgu nadivavu nī vaidi
sedigi lonai vuṁḍidem̐ jittamu vachchum̐ gāga

(||||)
sarasamu lāḍidene savulu vŏḍamum̐ gāga
virasamu lāḍidenu vĕgaḍu gādā
marigi pŏṁduseside manasu garam̐gum̐ gāga
vĕravu le kaligide vĕkkasamai yuṁḍadā

(||||)
nanubulu sūbidene nagavulu vachchum̐gāga
pĕnabulam̐ jaṭṭi tenu priyamu lavunā
manavulu sĕppidene machchigalu rem̐gum̐ gāga
anuvugu māḍāḍide naṁdamu lavunā

(||||)
saṁtamulai kūḍidene sammadaum̐gāga mana
paṁtamu lāḍidenu panu liṁpaunā
yiṁtalo śhrī veṁkaḍeśhum̐ ḍĕnasĕ nannum̐dāne
saṁtosā liḍuvaṁṭivi saṁgadule kāvā