Aadamdu galidem jaalu anni panulanu mele

ఆతఁడు గలితేఁ జాలు అన్ని పనులను మేలే
Language

(॥పల్లవి॥)
ఆతఁడు గలితేఁ జాలు అన్ని పనులను మేలే
యీతల నిన్ను జరయనేఁటికమ్మా మాకు

(॥అతఁ॥)
చలముగలవారిని సమ్మతించఁ జేయరాదు
సలిగెగలవారిని సాదించరాదు
కలిమిగలవారిని కాదుగూడదనరాదు
యెలమి నీతోడివాదు లేఁటికమ్మా మాకు

(॥ఆతఁ॥)
నాలితో నుండేవారి నవ్వించఁజేయరాదు
గేలిసేసేవారిని గెంటించరాదు
మేలమాడేవారిని మేరలు మీఱఁగరాదు
యీలీల నిన్ను జంకించనేఁటికమ్మా మాకు

(॥ఆతఁ॥)
మౌనాననుండేవారిని మాటలాడించఁగరాదు
నానాగుణమువారి నమ్మించరాదు
పూని శ్రీవేంకటేశుఁడు పొసఁగ నన్నే లె నిదె
యేనెపాలు వేయ నీతోనేఁటికమ్మా మాకు

(||pallavi||)
ādam̐ḍu galidem̐ jālu anni panulanu mele
yīdala ninnu jarayanem̐ṭigammā māgu

(||adam̐||)
salamugalavārini sammadiṁcham̐ jeyarādu
saligĕgalavārini sādiṁcharādu
kalimigalavārini kādugūḍadanarādu
yĕlami nīdoḍivādu lem̐ṭigammā māgu

(||ādam̐||)
nālido nuṁḍevāri navviṁcham̐jeyarādu
gelisesevārini gĕṁṭiṁcharādu
melamāḍevārini meralu mīṟam̐garādu
yīlīla ninnu jaṁkiṁchanem̐ṭigammā māgu

(||ādam̐||)
maunānanuṁḍevārini māḍalāḍiṁcham̐garādu
nānāguṇamuvāri nammiṁcharādu
pūni śhrīveṁkaḍeśhum̐ḍu pŏsam̐ga nanne lĕ nidĕ
yenĕbālu veya nīdonem̐ṭigammā māgu