Aadamdu battiseyamgaa nannee namare neegu

ఆతఁడు బత్తిసేయఁగా నన్నీ నమరె నీకు
Language

(॥పల్లవి॥)
ఆతఁడు బత్తిసేయఁగా నన్నీ నమరె నీకు
కాతరాన విడెమిచ్చి కాఁగిలించగదవే

(॥ఆత॥)
సంతోసానఁ బెనఁగఁగా జగడము లేదుగాక
పంతములాడుకొంటే పచ్చిదేరదా
వింతలేక వుండఁగానే వేడుకలు వుటెఁగాక
వంతులు వాసు లెంచితే వలపు గలుగునా

(॥ఆత॥)
ననుపు గలుగఁగానే నవ్వు లితవాయఁగాక
చెనకితే చలములు చిమ్మిఁరేగవా
వినయము చూపఁగానే వెలెసెఁగాక పొందులు
మనసు రాకుండితే మర్మములు గరఁగునా

(॥ఆత॥)
యిట్టె సేసలు చల్లఁగా నియ్యకోళ్లాయఁగాక
వట్టిసిగ్గున నుండితే వాడికలౌనా
నెట్టన శ్రీవేంకటాద్రివిలయుఁడు నిన్నుఁ గూడె
చుట్టరికమెంతైనా సొంపులే పుట్టించవా

(||pallavi||)
ādam̐ḍu battiseyam̐gā nannī namarĕ nīgu
kādarāna viḍĕmichchi kām̐giliṁchagadave

(||āda||)
saṁtosānam̐ bĕnam̐gam̐gā jagaḍamu ledugāga
paṁtamulāḍugŏṁṭe pachchideradā
viṁtalega vuṁḍam̐gāne veḍugalu vuḍĕm̐gāga
vaṁtulu vāsu lĕṁchide valabu galugunā

(||āda||)
nanubu galugam̐gāne navvu lidavāyam̐gāga
sĕnagide salamulu simmim̐regavā
vinayamu sūbam̐gāne vĕlĕsĕm̐gāga pŏṁdulu
manasu rāguṁḍide marmamulu garam̐gunā

(||āda||)
yiṭṭĕ sesalu sallam̐gā niyyagoḽlāyam̐gāga
vaṭṭisigguna nuṁḍide vāḍigalaunā
nĕṭṭana śhrīveṁkaḍādrivilayum̐ḍu ninnum̐ gūḍĕ
suṭṭarigamĕṁtainā sŏṁpule puṭṭiṁchavā