Aadamdide neevide aragorademtige

ఆతఁడిదె నీవిదె అరగొరతేఁటికే
Language

(॥పల్లవి॥)
ఆతఁడిదె నీవిదె అరగొరతేఁటికే
కాతరానఁ గాఁగిలించి కపటము లేఁటికే

(॥ఆతఁ॥)
యిచ్చకము లాడేది హితము మోహములకు
పచ్చిదేర నవ్వేది ఫల మందుకు
ముచ్చటలు నడుపేది మొదలు కూటములకు
యెచ్చుకుందుసొలపులు యీడ మరియేఁటికే

(॥ఆతఁ॥)
తమకించి పైకొనుటే తగవు వయసులకు
అమరఁగఁ బెనఁగేదే ఆయ మందుకు
సమమగు సరసాలే చవులు కరఁగులకు
తిమిరేటి పంతముల తెరమఱఁగేఁటికి

(॥ఆతఁ॥)
ఇటువలెఁ గూడేదే యెన్నిక ఆసలకును
ఘటన మోవితేనెలే కందు వందుకు
తటుకనఁగూడె శ్రీవేంకటరమణుఁడు నిన్ను
నటనలన్నియుఁగూడె నాలి ఇఁకనేఁటికే

(||pallavi||)
ādam̐ḍidĕ nīvidĕ aragŏradem̐ṭige
kādarānam̐ gām̐giliṁchi kabaḍamu lem̐ṭige

(||ādam̐||)
yichchagamu lāḍedi hidamu mohamulagu
pachchidera navvedi phala maṁdugu
muchchaḍalu naḍubedi mŏdalu kūḍamulagu
yĕchchuguṁdusŏlabulu yīḍa mariyem̐ṭige

(||ādam̐||)
tamagiṁchi paigŏnuḍe tagavu vayasulagu
amaram̐gam̐ bĕnam̐gede āya maṁdugu
samamagu sarasāle savulu karam̐gulagu
timireḍi paṁtamula tĕramaṟam̐gem̐ṭigi

(||ādam̐||)
iḍuvalĕm̐ gūḍede yĕnniga āsalagunu
ghaḍana movidenĕle kaṁdu vaṁdugu
taḍuganam̐gūḍĕ śhrīveṁkaḍaramaṇum̐ḍu ninnu
naḍanalanniyum̐gūḍĕ nāli im̐kanem̐ṭige