ఆతఁడిదె నీవిదె అన్నిటాను జాణలు
(॥పల్లవి॥)
ఆతఁడిదె నీవిదె అన్నిటాను జాణలు
యేతుల నింకానేలే యెడమాఁటలు
(॥ఆత॥)
అంకెకు రానేరిచితే అలుకలైనా సుఖమే
మంకుఁదనాలుడిగినమానినులకు
సంకెదీరితే మరునిశరములెల్లా విరులే
యింకనైనా మామాఁట లియ్యకొనరే
(॥ఆత॥)
విననేరిచినఁజాలు విరహమైన సుఖమే
మనసుదెలిసినట్టి మగువలకు
చెనకి లాలించితేను చిలుకలు మాఁటలాడు
చలములు మాని యిఁక సమ్మతించరే
(॥ఆత॥)
సరసము నేరిచితే జంకెనలైనా సుఖమే
తరితీపులెఁరిగిన తరుణులకు
యిరవై శ్రీవేంకటేశుఁడిదివో నిన్నిటు గూడె
యెరవులు మరియేల యెనశుండరే
(||pallavi||)
ādam̐ḍidĕ nīvidĕ anniḍānu jāṇalu
yedula niṁkānele yĕḍamām̐ṭalu
(||āda||)
aṁkĕgu rāneriside alugalainā sukhame
maṁkum̐danāluḍiginamāninulagu
saṁkĕdīride maruniśharamulĕllā virule
yiṁkanainā māmām̐ṭa liyyagŏnare
(||āda||)
vinanerisinam̐jālu virahamaina sukhame
manasudĕlisinaṭṭi maguvalagu
sĕnagi lāliṁchidenu silugalu mām̐ṭalāḍu
salamulu māni yim̐ka sammadiṁchare
(||āda||)
sarasamu neriside jaṁkĕnalainā sukhame
taridībulĕm̐rigina taruṇulagu
yiravai śhrīveṁkaḍeśhum̐ḍidivo ninniḍu gūḍĕ
yĕravulu mariyela yĕnaśhuṁḍare