Aadamdemta nee vemta au navune

ఆతఁడెంత నీ వెంత ఔ నవునే
Language

(॥పల్లవి॥)
ఆతఁడెంత నీ వెంత ఔ నవునే
ఘాతఁ బెద్దరిక మింతాఁ గట్టుకొంటివే

(॥ఆత॥)
పంతము లన్నియును నీపతిపైనె నెరుపేపు
పొంతల నిన్నే మని పొగడుదునే
అంతటి నీకొనగోరు అతనిపై మోపితిని
దొంతరమొనలు చూప దొడ్డదానవే

(॥ఆత॥)
చలము లితనిపైనె సాదించ నేరిచితివి
నిలిచె నింత లాభము నీవద్దనే
పిలువఁగానె పెనఁగి బీరమునుఁ జూపితిని
కలికితనము లిందె కైకొంటివే

(॥ఆత॥)
యేతు లెల్ల శ్రీవెంకటేశ్వరునికె చూపేవు
నీతి నడచేవారిలో నీవే కదె
యీతల మామాటలకు నితని నిట్టె కూడితి
పోతరించి యిన్నిటా నీపుణ్య మాయఁ గదవే

(||pallavi||)
ādam̐ḍĕṁta nī vĕṁta au navune
ghādam̐ bĕddariga miṁtām̐ gaṭṭugŏṁṭive

(||āda||)
paṁtamu lanniyunu nībadibainĕ nĕrubebu
pŏṁtala ninne mani pŏgaḍudune
aṁtaḍi nīgŏnagoru adanibai mobidini
dŏṁtaramŏnalu sūba dŏḍḍadānave

(||āda||)
salamu lidanibainĕ sādiṁcha nerisidivi
nilisĕ niṁta lābhamu nīvaddane
piluvam̐gānĕ pĕnam̐gi bīramunum̐ jūbidini
kaligidanamu liṁdĕ kaigŏṁṭive

(||āda||)
yedu lĕlla śhrīvĕṁkaḍeśhvarunigĕ sūbevu
nīdi naḍasevārilo nīve kadĕ
yīdala māmāḍalagu nidani niṭṭĕ kūḍidi
podariṁchi yinniḍā nībuṇya māyam̐ gadave