Aadamdemta nee vemta ademe neevu

ఆతఁడెంత నీ వెంత అదేమే నీవు
Language

(॥పల్లవి॥)
ఆతఁడెంత నీ వెంత అదేమే నీవు
యేతరితనము లింత ఇతవా నీకు

(॥ఆతఁ॥)
మొగము చూచి చూచి మొలకనవ్వు నవ్వేవు
యెగసక్కే లకుఁ బతి నిదేమే నీవు
చిగురుమోవిమోటలఁ జిమ్మిరేఁగ సొలసేవు
వెగటుజాణతనాల వేడుకా నీకు

(॥ఆతఁ॥)
కులుకుగుబ్బ లదరఁ గొసరి సన్నసేసేవు
యెలఇంచే వితని నితేమే నీవు
చిలుకు గోరికొనలఁ జెనకి వేఁడుకొనేవు
వెలలేని సరసాలు వేడుకానీకు

(॥ఆతఁ॥)
గుట్టుతో వద్దఁ గూచుండి కొప్పు గడుదువ్వేవు
యిట్టె శ్రీవేంకటేశు నీదేమే నీవు
నెట్టన నన్నితఁడేలె నే నలమేలుమంగను
వెట్టికిఁ గూడె వతని వేడుకా నీకు

(||pallavi||)
ādam̐ḍĕṁta nī vĕṁta ademe nīvu
yedaridanamu liṁta idavā nīgu

(||ādam̐||)
mŏgamu sūsi sūsi mŏlaganavvu navvevu
yĕgasakke lagum̐ badi nideme nīvu
sigurumovimoḍalam̐ jimmirem̐ga sŏlasevu
vĕgaḍujāṇadanāla veḍugā nīgu

(||ādam̐||)
kulugugubba ladaram̐ gŏsari sannasesevu
yĕla̮iṁche vidani nideme nīvu
silugu gorigŏnalam̐ jĕnagi vem̐ḍugŏnevu
vĕlaleni sarasālu veḍugānīgu

(||ādam̐||)
guṭṭudo vaddam̐ gūsuṁḍi kŏppu gaḍuduvvevu
yiṭṭĕ śhrīveṁkaḍeśhu nīdeme nīvu
nĕṭṭana nannidam̐ḍelĕ ne nalamelumaṁganu
vĕṭṭigim̐ gūḍĕ vadani veḍugā nīgu