Aadamdemta ne nemta avugade selulaala

ఆతఁడెంత నే నెంత అవుగదే చెలులాల
Language

(॥పల్లవి॥)
ఆతఁడెంత నే నెంత అవుగదే చెలులాల
యీ తలఁపులే పతికి నిట్టే విన్నవించరే

(॥॥)
చిప్పిల నవ్వఁగఁ బోతే సిగ్గులు రేఁగవా
దప్పికి మో వడిగితే దగ దొట్టదా
కొప్పు వంచి మొక్కఁబోతే కురియవా చెమటలు
అప్పుడే సరసమాడ నమరునా నాకు

(॥॥)
మాటలాడఁ బోతేను మర్మాలు సోఁకవా
కాటుక కండ్లఁ జూచితే కప్పదా తమి
నీటునఁ బెనఁగఁ బోతే నిండుకోవా పులకలు
కూటమికిఁ జేయి చాఁచఁ గూడునా నాకు

(॥॥)
చన్నుల నొత్తఁగఁ బోతే జడియవా మఱపులు
మిన్నక గోర నంటితే మించదా దయ
యిన్నిటా శ్రీ వేంకటేశుఁడింతలోనె నన్నుఁగూడే
సన్నల నే బత్తి చూప సంగతే నాకూ

(||pallavi||)
ādam̐ḍĕṁta ne nĕṁta avugade sĕlulāla
yī talam̐pule padigi niṭṭe vinnaviṁchare

(||||)
sippila navvam̐gam̐ bode siggulu rem̐gavā
dappigi mo vaḍigide daga dŏṭṭadā
kŏppu vaṁchi mŏkkam̐bode kuriyavā sĕmaḍalu
appuḍe sarasamāḍa namarunā nāgu

(||||)
māḍalāḍam̐ bodenu marmālu som̐kavā
kāḍuga kaṁḍlam̐ jūside kappadā tami
nīḍunam̐ bĕnam̐gam̐ bode niṁḍugovā pulagalu
kūḍamigim̐ jeyi sām̐sam̐ gūḍunā nāgu

(||||)
sannula nŏttam̐gam̐ bode jaḍiyavā maṟabulu
minnaga gora naṁṭide miṁchadā daya
yinniḍā śhrī veṁkaḍeśhum̐ḍiṁtalonĕ nannum̐gūḍe
sannala ne batti sūba saṁgade nāgū