Aadamdemi sesinaanu adiyu naabhaagyame

ఆతఁడేమి సేసినాను అదియు నాభాగ్యమే
Language

(॥పల్లవి॥)
ఆతఁడేమి సేసినాను అదియు నాభాగ్యమే

కాతరించి నేనెట్టు గరిసింతునే

(॥ఆత॥)
కలువపూవులు వేసి కడఁగి యాచేతనే

కులికి విభుని నెట్టు గోర నంటేనే

వలపులు చల్లిచల్లి వరుస నప్పటి నేనే

చలపట్టి యెటువలె జంకింతునే

(॥ఆత॥)
సరసమాడుచు నవ్వి చక్కఁగా నానోరనే

యిరవుగా పలుసోఁకు లెట్టు నింతునే

గిరికుచముల నొత్తి కినిసి యంతటిలోన

విరహము రేఁచి యెట్టు వేరెవేరె వుందునే

(॥ఆత॥)
కందువరతులఁ గూడి కమ్మటి నాకాఁగిటనే

విందువలె సారె నెట్టు వేసరింతునే

అంది శ్రీవేంకటేశుఁడు ఆదరించి నన్ను నేలె

మందెమేళమున నేట్టు మాఁటల మెప్పింతునే

(||pallavi||)
ādam̐ḍemi sesinānu adiyu nābhāgyame

kādariṁchi nenĕṭṭu garisiṁtune

(||āda||)
kaluvabūvulu vesi kaḍam̐gi yāsedane

kuligi vibhuni nĕṭṭu gora naṁṭene

valabulu sallisalli varusa nappaḍi nene

salabaṭṭi yĕḍuvalĕ jaṁkiṁtune

(||āda||)
sarasamāḍusu navvi sakkam̐gā nānorane

yiravugā palusom̐ku lĕṭṭu niṁtune

girigusamula nŏtti kinisi yaṁtaḍilona

virahamu rem̐si yĕṭṭu verĕverĕ vuṁdune

(||āda||)
kaṁduvaradulam̐ gūḍi kammaḍi nāgām̐giḍane

viṁduvalĕ sārĕ nĕṭṭu vesariṁtune

aṁdi śhrīveṁkaḍeśhum̐ḍu ādariṁchi nannu nelĕ

maṁdĕmeḽamuna neṭṭu mām̐ṭala mĕppiṁtune