Aadamdeda neeveda aasalela seseeve

ఆతఁడేడ నీవేడ ఆసలేల సేసీవే
Language

(॥పల్లవి॥)
ఆతఁడేడ నీవేడ ఆసలేల సేసీవే
కాతరాన నాతఁడు కైవశమై యుండఁగా

(॥ఆతఁ॥)
చనువులు సేసుకొని సంగాతపుమాట లాడి
యెనసె నాపతినేల యెలయించేవే
వినయము లెల్లాఁ జేసి వేడుకలు పుట్టించి
పనిలేని పనికేల బాఁతిపడేవే

(॥ఆతఁ॥)
వట్టివావులఁ జెనకి వలవని నవ్వు నవ్వి
చుట్టి చుట్టి పతినేల సొక్కు రేఁచేవే
గుట్టుతోడ మోవి చూపి కొలువులో నిలుచుండి
గుట్టువాయతనమునఁ గరఁగ నీకేలే

(॥ఆతఁ॥)
పైకొని సరసమాడి పక్కఁ బండి యంతలోనె
యీకడ శ్రీవేంకటేశు కేల లాడేవే
నీకితఁడు మేలువాఁడు నన్నిట్టె మన్నించినాఁడు
కాకరి విద్యలనేల కాఁతాళించేవే

(||pallavi||)
ādam̐ḍeḍa nīveḍa āsalela sesīve
kādarāna nādam̐ḍu kaivaśhamai yuṁḍam̐gā

(||ādam̐||)
sanuvulu sesugŏni saṁgādabumāḍa lāḍi
yĕnasĕ nābadinela yĕlayiṁcheve
vinayamu lĕllām̐ jesi veḍugalu puṭṭiṁchi
panileni panigela bām̐tibaḍeve

(||ādam̐||)
vaṭṭivāvulam̐ jĕnagi valavani navvu navvi
suṭṭi suṭṭi padinela sŏkku rem̐seve
guṭṭudoḍa movi sūbi kŏluvulo nilusuṁḍi
guṭṭuvāyadanamunam̐ garam̐ga nīgele

(||ādam̐||)
paigŏni sarasamāḍi pakkam̐ baṁḍi yaṁtalonĕ
yīgaḍa śhrīveṁkaḍeśhu kela lāḍeve
nīgidam̐ḍu meluvām̐ḍu nanniṭṭĕ manniṁchinām̐ḍu
kāgari vidyalanela kām̐tāḽiṁcheve