Aadamde yeṟumgunu annibanulu

ఆతఁడే యెఱుఁగును అన్నిపనులు
Language

(॥పల్లవి॥)
ఆతఁడే యెఱుఁగును అన్నిపనులు
నీతి యెంచితే తన నెలఁత నే ననవే

(॥॥)
మలసి యాడఁ జొచ్చితే మాట లెన్నైనాఁ గలవు
తలఁచితే నెన్ని లేవు తలపోఁతలు
నెలకొన్న దెఱఁగవా నీరు కొలఁది తామర
చెలియరో నే నేమని చెప్పేనే నీకూ

(॥॥)
మునుకొని నవ్వితేను మొగమెల్లా నవ్వు
కనుఁగొంటే నిండుకొనుఁ గనుచూపులు
పెనఁగ నేఁటికే నీవు పిండెంతే నిప్పటి
దినదినము నెంతని తెలిపేనే నీకు

(॥॥)
కడు నెంత వెరిగినా కౌఁగిటిలోనే చన్నులు
బడి వాయకుండి తేను పాయదు తమి
అడరి శ్రీ వేంకటేశుఁడంతలోనే నన్నేలె యీ
యెడఁ బైఁడెంతే తూని కేమనెనే నీకూ

(||pallavi||)
ādam̐ḍe yĕṟum̐gunu annibanulu
nīdi yĕṁchide tana nĕlam̐ta ne nanave

(||||)
malasi yāḍam̐ jŏchchide māḍa lĕnnainām̐ galavu
talam̐side nĕnni levu talabom̐talu
nĕlagŏnna dĕṟam̐gavā nīru kŏlam̐di tāmara
sĕliyaro ne nemani sĕppene nīgū

(||||)
munugŏni navvidenu mŏgamĕllā navvu
kanum̐gŏṁṭe niṁḍugŏnum̐ ganusūbulu
pĕnam̐ga nem̐ṭige nīvu piṁḍĕṁte nippaḍi
dinadinamu nĕṁtani tĕlibene nīgu

(||||)
kaḍu nĕṁta vĕriginā kaum̐giḍilone sannulu
baḍi vāyaguṁḍi tenu pāyadu tami
aḍari śhrī veṁkaḍeśhum̐ḍaṁtalone nannelĕ yī
yĕḍam̐ baim̐ḍĕṁte tūni kemanĕne nīgū