Aadamde yeṟamgamdaa adiva nee laagulu

ఆతఁడే యెఱఁగఁడా అతివ నీ లాగులు
Language

(॥పల్లవి॥)
ఆతఁడే యెఱఁగఁడా అతివ నీ లాగులు
యీతల నీ మచ్చిక లింకా నెంత చెప్పేవే

(॥ఆతఁ॥)
మనసులో తమకము మాఁటలనే కానవచ్చె
కనుచూపులనె యింపు గనుపట్టెను
వినయములనే బత్తి వెల్లవిరియై మించె
యెనసే నీ చుట్టరిక మింకా నెంత చెప్పేవే

(॥ఆతఁ॥)
చెప్పరాని మోహములు చిరునవ్వులఁ దెలిసె
ముప్పిరిఁ గళలు మోమున వెలసె
కుప్పలైన పులకల కోరికలు దేటపడె
యిప్పుడు నీ యనురాగ మేమి చెప్పేవే

(॥ఆతఁ॥)
సరసపు చెనకులు చనుగుబ్బ లెఱిఁగించె
మరిగిన మమత మర్మముల నిండె
యిరవై శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నిన్ను నేలె
యెరవుగా నీవలపు యిఁక నేమి చేప్పేవే

(||pallavi||)
ādam̐ḍe yĕṟam̐gam̐ḍā adiva nī lāgulu
yīdala nī machchiga liṁkā nĕṁta sĕppeve

(||ādam̐||)
manasulo tamagamu mām̐ṭalane kānavachchĕ
kanusūbulanĕ yiṁpu ganubaṭṭĕnu
vinayamulane batti vĕllaviriyai miṁchĕ
yĕnase nī suṭṭariga miṁkā nĕṁta sĕppeve

(||ādam̐||)
sĕpparāni mohamulu sirunavvulam̐ dĕlisĕ
muppirim̐ gaḽalu momuna vĕlasĕ
kuppalaina pulagala korigalu deḍabaḍĕ
yippuḍu nī yanurāga memi sĕppeve

(||ādam̐||)
sarasabu sĕnagulu sanugubba lĕṟim̐giṁchĕ
marigina mamada marmamula niṁḍĕ
yiravai śhrīveṁkaḍeśhum̐ ḍinniḍānu ninnu nelĕ
yĕravugā nīvalabu yim̐ka nemi seppeve