Aadamde yeedagu vachchee nannidigini

ఆతఁడే యీడకు వచ్చీ నన్నిటికిని
Language

(॥పల్లవి॥)
ఆతఁడే యీడకు వచ్చీ నన్నిటికిని
యీతల మాపు దాఁకా నీ కేమి చెప్పే మిఁకనూ

(॥ఆతఁ॥)
పవ్వళించీ నాయకుఁడు పైపైనీ కెదురుచూచి
యివ్వల సింగారించే వింకా నీవు
యెవ్వ రెంతగాఁ జెప్పిరొ యేమని తలపోసేవు
రవ్వగా వచ్చేయట్టైతే రావా నీ వప్పుడే

(॥ఆతఁ॥)
సరి నీ కెదురుచూచి జాగరా లున్నాఁ డతఁడు
యిరవై అద్దము చూచే వింకా నీవు
సరసానకో నీవు చలమెంత పట్టితివొ
యెరవు లేకున్నఁ జన వియ్యవా నీ వింతకా

(॥ఆతఁ॥)
వేగిరాన నేతెంచి శ్రీవేంకటేశుఁ డీడఁ గూడె
యీగతి సిగ్గులువడే వింకా నీవు
బాగుగా నీతనింటికి బడినే నీవు వచ్చితి
నీగుణాలకుఁ దగ్గట్టు నేరవా నీ విఁకనూ

(||pallavi||)
ādam̐ḍe yīḍagu vachchī nanniḍigini
yīdala mābu dām̐kā nī kemi sĕppe mim̐kanū

(||ādam̐||)
pavvaḽiṁchī nāyagum̐ḍu paibainī kĕdurusūsi
yivvala siṁgāriṁche viṁkā nīvu
yĕvva rĕṁtagām̐ jĕppirŏ yemani talabosevu
ravvagā vachcheyaṭṭaide rāvā nī vappuḍe

(||ādam̐||)
sari nī kĕdurusūsi jāgarā lunnām̐ ḍadam̐ḍu
yiravai addamu sūse viṁkā nīvu
sarasānago nīvu salamĕṁta paṭṭidivŏ
yĕravu legunnam̐ jana viyyavā nī viṁtagā

(||ādam̐||)
vegirāna nedĕṁchi śhrīveṁkaḍeśhum̐ ḍīḍam̐ gūḍĕ
yīgadi sigguluvaḍe viṁkā nīvu
bāgugā nīdaniṁṭigi baḍine nīvu vachchidi
nīguṇālagum̐ daggaṭṭu neravā nī vim̐kanū