ఆతఁడే యజమానుఁడు ఆదినారాయణుఁడు
(॥పల్లవి॥)
ఆతఁడే యజమానుఁడు ఆదినారాయణుఁడు
ఆతని బంట్లము మాకు నన్నిటా నిశ్చింతము
(॥ఆతఁ॥)
యేలికెగల బంటుకు యెక్కడిది విచారము
పాలించే మగఁడుగల పడఁతి కేడ చింత
కోలుముందై తండ్రిగల కొడుకు కేది తొడుసు
యీలీల హరిదాసుని కెక్కడికోరికెలు
(॥ఆతఁ॥)
బలుదుర్గము వానికి భయ మేమిటా లేదు
కలిమిగలవానికి కడమ లేదు
యిల క్షేత్రవంతునికి నెందూ దరిద్రము లేదు
అల శ్రీపతిబంట్లకు నలమట లేదు
(॥ఆతఁ॥)
పట్టిన ముద్రుంగరపుప్రధాని కెదురు లేదు
కుట్టి చాతనికివారికిఁ గొంకు లేదు
నెట్టిన శ్రీవేంకటాద్రినిలయు సేవకులము
గుట్టుతోడ బ్రదికేము గుఱి మాకు నతఁడే
(||pallavi||)
ādam̐ḍe yajamānum̐ḍu ādinārāyaṇum̐ḍu
ādani baṁṭlamu māgu nanniḍā niśhchiṁtamu
(||ādam̐||)
yeligĕgala baṁṭugu yĕkkaḍidi visāramu
pāliṁche magam̐ḍugala paḍam̐ti keḍa siṁta
kolumuṁdai taṁḍrigala kŏḍugu kedi tŏḍusu
yīlīla haridāsuni kĕkkaḍigorigĕlu
(||ādam̐||)
baludurgamu vānigi bhaya memiḍā ledu
kalimigalavānigi kaḍama ledu
yila kṣhetravaṁtunigi nĕṁdū daridramu ledu
ala śhrībadibaṁṭlagu nalamaḍa ledu
(||ādam̐||)
paṭṭina mudruṁgarabupradhāni kĕduru ledu
kuṭṭi sādanigivārigim̐ gŏṁku ledu
nĕṭṭina śhrīveṁkaḍādrinilayu sevagulamu
guṭṭudoḍa bradigemu guṟi māgu nadam̐ḍe