Aadamde neevu gaavaa amdugeme

ఆతఁడే నీవు గావా అందుకేమే
Language

(॥పల్లవి॥)
ఆతఁడే నీవు గావా అందుకేమే
కాతరపు సరసాలు కడు రేఁచవలెనా

(॥ఆతఁ॥)
తమకపు రమణుఁడు దగ్గరఁ గూచుండితేను
జమళిసిగ్గు లేటికి జళిపించేవే
కొమరెపు నిన్నాతఁడు కొంగువట్టి పెనఁగితే
వుమురుకూటపుఁజూపు లుగ్గడించ నేఁటికే

(॥అతఁ॥)
నయగారి నీ విభుఁడు నవ్వులు నవ్వితేను
ప్రియమున బింకాలు పెనచనేలే
క్రియయెరిఁగి నీమీఁద కేలు చాఁచి కొసరితే
నియతపుఁ బెనువొట్లు నీకేఁటికే

(॥ఆతఁ॥)
శ్రీ వేంకటేశ్వరుఁడు చెక్కులు నిన్ను నొక్కితే
నీవల రతుల భ్రమయించ నేఁటికే
కైవసమై నీవితఁడు కప్పుర విడె మిచ్చితే
వేవేగఁ గూడి మరి వెరగంద నేఁటికే

(||pallavi||)
ādam̐ḍe nīvu gāvā aṁdugeme
kādarabu sarasālu kaḍu rem̐savalĕnā

(||ādam̐||)
tamagabu ramaṇum̐ḍu daggaram̐ gūsuṁḍidenu
jamaḽisiggu leḍigi jaḽibiṁcheve
kŏmarĕbu ninnādam̐ḍu kŏṁguvaṭṭi pĕnam̐gide
vumurugūḍabum̐jūbu luggaḍiṁcha nem̐ṭige

(||adam̐||)
nayagāri nī vibhum̐ḍu navvulu navvidenu
priyamuna biṁkālu pĕnasanele
kriyayĕrim̐gi nīmīm̐da kelu sām̐si kŏsaride
niyadabum̐ bĕnuvŏṭlu nīgem̐ṭige

(||ādam̐||)
śhrī veṁkaḍeśhvarum̐ḍu sĕkkulu ninnu nŏkkide
nīvala radula bhramayiṁcha nem̐ṭige
kaivasamai nīvidam̐ḍu kappura viḍĕ michchide
vevegam̐ gūḍi mari vĕragaṁda nem̐ṭige