ఆతఁడే నన్నందుకుఁగా అట్టె కూరిమి గొసరీ (రె?)
(॥పల్లవి॥)
ఆతఁడే నన్నందుకుఁగా అట్టె కూరిమి గొసరీ (రె?)
యీతలనాతల నీవే యెడమాఁట లాడేవా
(॥ఆత॥)
మాట మాటగా విభుని మంతనాన నాడుకొంటే
చీటికిమాటికిఁ బోయి చెప్పుదురటే
నీటున నాతనికి నే నీవంటిదాననేకానా
యేఁటికే నీవొకతెవే యితవరివటవే
(॥ఆత॥)
అక్కవంటా నీతో నాతనిగుట్టు చెప్పితే
కక్కసించి నీవు తారుకాణింతురా
చక్కనిఇద్దరము సరివారమే కామా
వెక్కసాన నాకంటె విశ్వాసివా
(॥ఆత॥)
నిగ్గులశ్రీవేంకటేశునేరుపు నీతో మెచ్చితే
సిగ్గువడ నెఱుకలు సేసుకొందురా
అగ్గమై నిన్నుఁ గూడినట్టె నన్నుఁ గూడితేను
వెగ్గళించేవు నీవంటివేడుకే నాకును
(||pallavi||)
ādam̐ḍe nannaṁdugum̐gā aṭṭĕ kūrimi gŏsarī (rĕ?)
yīdalanādala nīve yĕḍamām̐ṭa lāḍevā
(||āda||)
māḍa māḍagā vibhuni maṁtanāna nāḍugŏṁṭe
sīḍigimāḍigim̐ boyi sĕppuduraḍe
nīḍuna nādanigi ne nīvaṁṭidānanegānā
yem̐ṭige nīvŏgadĕve yidavarivaḍave
(||āda||)
akkavaṁṭā nīdo nādaniguṭṭu sĕppide
kakkasiṁchi nīvu tārugāṇiṁturā
sakkaniiddaramu sarivārame kāmā
vĕkkasāna nāgaṁṭĕ viśhvāsivā
(||āda||)
niggulaśhrīveṁkaḍeśhunerubu nīdo mĕchchide
sigguvaḍa nĕṟugalu sesugŏṁdurā
aggamai ninnum̐ gūḍinaṭṭĕ nannum̐ gūḍidenu
vĕggaḽiṁchevu nīvaṁṭiveḍuge nāgunu