Aadamde kaavalenamte atte pomdusesem gaaga

ఆతఁడే కావలెనంటే అట్టె పొందుసేసేఁ గాక
Language

(॥పల్లవి॥)
ఆతఁడే కావలెనంటే అట్టె పొందుసేసేఁ గాక
యీతల నో చెలులాల యేల వేగిరించేరే

(॥ఆత॥)
మన్ననగలుగువా రేమాటలాడినా నింపులు
కిన్నెరమీటుల గిలిగింపు లింపులు
చన్నులు దాఁకఁ బెనఁగ సాదింపు లింపులు
వున్నవారేమనినా నొద్దికౌనా పతికి

(॥ఆత॥)
చెంగటనున్నవా రేచేఁత సేసినా నింపులు
వుంగరపువేలిసన్న లొగినింపులు
సంగతి నద్దములోనిసరినీడ లింపులు
జంగిలిసరసములు చవులౌనా పతికి

(॥ఆత॥)
ననపుగలుగువారినవ్వులెల్లా నింపులు
తనివోనిజవ్వనమదము లింపులు
పనితో నలమేలుమంగపతి శ్రీవేంకటేశుఁడు
వినయాన నన్ను నేలె వేసటౌనా పతికి

(||pallavi||)
ādam̐ḍe kāvalĕnaṁṭe aṭṭĕ pŏṁdusesem̐ gāga
yīdala no sĕlulāla yela vegiriṁchere

(||āda||)
mannanagaluguvā remāḍalāḍinā niṁpulu
kinnĕramīḍula giligiṁpu liṁpulu
sannulu dām̐kam̐ bĕnam̐ga sādiṁpu liṁpulu
vunnavāremaninā nŏddigaunā padigi

(||āda||)
sĕṁgaḍanunnavā resem̐ta sesinā niṁpulu
vuṁgarabuvelisanna lŏginiṁpulu
saṁgadi naddamulonisarinīḍa liṁpulu
jaṁgilisarasamulu savulaunā padigi

(||āda||)
nanabugaluguvārinavvulĕllā niṁpulu
tanivonijavvanamadamu liṁpulu
panido nalamelumaṁgabadi śhrīveṁkaḍeśhum̐ḍu
vinayāna nannu nelĕ vesaḍaunā padigi