Aadamdade nee vide aragorada lemtige

ఆతఁడదె నీ విదె అరగొరత లేఁటికే
Language

(॥పల్లవి॥)
ఆతఁడదె నీ విదె అరగొరత లేఁటికే
చేతిలోనివాఁ డితఁడు సిలుగు లింకేఁటికే

(॥ఆతఁ॥)
చలువైన నీమోముచంద్రుడు వెన్నెలగా
చెలియ నీమతిలోని చీఁక టేఁటికే
నిలువుఁ గొప్పుమేఘపు నీడలు నీమేన నిండె
యెలమితో విరహపుటెండ లేఁటికే

(॥ఆతఁ॥)
వుదుటునీనాసికపుటూరుపుగాలి విసరీ
చెదరుఁజెమటవానచిత్త డేఁటికే
పదరమైఁదీగె బంగారు పసిమి దేరీ
యిదె మోవిపండు వాడ నింతయేఁటికే

(॥ఆతఁ॥)
పొంచినవీచెక్కులనే పులకలపంట వండె
యించుకనడిమికఱ విఁకనేఁటికే
అంచెల శ్రీవేంకటేశుఁ డాతఁ డదె నిన్నుఁ గూడె
మంచపు దొమ్ములలోన మంకు లిఁకనేఁటికే

(||pallavi||)
ādam̐ḍadĕ nī vidĕ aragŏrada lem̐ṭige
sedilonivām̐ ḍidam̐ḍu silugu liṁkem̐ṭige

(||ādam̐||)
saluvaina nīmomusaṁdruḍu vĕnnĕlagā
sĕliya nīmadiloni sīm̐ka ṭem̐ṭige
niluvum̐ gŏppumeghabu nīḍalu nīmena niṁḍĕ
yĕlamido virahabuḍĕṁḍa lem̐ṭige

(||ādam̐||)
vuduḍunīnāsigabuḍūrubugāli visarī
sĕdarum̐jĕmaḍavānasitta ḍem̐ṭige
padaramaim̐dīgĕ baṁgāru pasimi derī
yidĕ movibaṁḍu vāḍa niṁtayem̐ṭige

(||ādam̐||)
pŏṁchinavīsĕkkulane pulagalabaṁṭa vaṁḍĕ
yiṁchuganaḍimigaṟa vim̐kanem̐ṭige
aṁchĕla śhrīveṁkaḍeśhum̐ ḍādam̐ ḍadĕ ninnum̐ gūḍĕ
maṁchabu dŏmmulalona maṁku lim̐kanem̐ṭige