(॥పల్లవి॥)
ఆతఁడదె నే నిదె అమ్మలాలా
నీతితోడ నడుగరే నేరుపరి చెలులు
(॥ఆతఁ॥)
బిగువుఁజన్నులు నావి ప్రియములెల్లఁ దనవి
పగటుతో నిటమీఁదిపంతము లేవి
నగవులు చెక్కులవి నాటకాలు మొక్కులని
తగవు లింతటిమీఁద తనకో నాకో
(॥ఆతఁ॥)
చెనకేచేతులు నావి జిగిమర్మాలు దనవి
కనుఁగొనే యిటమీఁదికత లేవి
వినయాలు మాటలేవి వేసాలు నీటులవి
తనివోనిధైర్యములు తనకో నాకో
(॥ఆతఁ॥)
కూడినకూటమి నాది కోరికె చెల్లెఁ దనది
ఆడుకోలు మాట లిఁక నవి యేవి
పాడితో శ్రీవేంకటాద్రిపతి నన్నుఁ గలసెను
తాడుపడ్డసిగ్గు లిఁకఁ దనకో నాకో
(||pallavi||)
ādam̐ḍadĕ ne nidĕ ammalālā
nīdidoḍa naḍugare nerubari sĕlulu
(||ādam̐||)
biguvum̐jannulu nāvi priyamulĕllam̐ danavi
pagaḍudo niḍamīm̐dibaṁtamu levi
nagavulu sĕkkulavi nāḍagālu mŏkkulani
tagavu liṁtaḍimīm̐da tanago nāgo
(||ādam̐||)
sĕnagesedulu nāvi jigimarmālu danavi
kanum̐gŏne yiḍamīm̐digada levi
vinayālu māḍalevi vesālu nīḍulavi
tanivonidhairyamulu tanago nāgo
(||ādam̐||)
kūḍinagūḍami nādi korigĕ sĕllĕm̐ danadi
āḍugolu māḍa lim̐ka navi yevi
pāḍido śhrīveṁkaḍādribadi nannum̐ galasĕnu
tāḍubaḍḍasiggu lim̐kam̐ danago nāgo