ఆతఁడదె మీరదె అప్పగించితిమి నేము
(॥పల్లవి॥)
ఆతఁడదె మీరదె అప్పగించితిమి నేము
మీ తలఁపుదాన నేను మీకేలే చింత
(॥ఆత॥)
నన్నునేల అడిగేరే నాఁటినేఁటిసుద్దులు
అన్నియును నడుగరే ఆతనిని
పన్నినవారిద్దరికి పైపై మీరే కారా
వెన్న చేతఁ బట్టుకొని వేఁడనేలే నెయ్యి
(॥ఆత॥)
యేల కొడఁబరచేరే యింతలోనే నన్నును
చాలు నొడఁబరచరే చాలు నాతని
పోలిమితో నింతేసిబుద్ది మీ రెరఁగనిదా
తాలము చేతఁబట్టుకొని దాఁటనేలే వాకిలి
(॥ఆత॥)
ఆన లేల పెట్టేరే ఆతనితోఁ గూడుమని
పేని యాన లతనికే పెట్టరాదా
ఆనుక శ్రీ వేంకటేశుఁడాతఁడే నన్నుఁ గూడె
తేనెలువంటిచెలులు తీపులు మీకేలే
(||pallavi||)
ādam̐ḍadĕ mīradĕ appagiṁchidimi nemu
mī talam̐pudāna nenu mīgele siṁta
(||āda||)
nannunela aḍigere nām̐ṭinem̐ṭisuddulu
anniyunu naḍugare ādanini
panninavāriddarigi paibai mīre kārā
vĕnna sedam̐ baṭṭugŏni vem̐ḍanele nĕyyi
(||āda||)
yela kŏḍam̐barasere yiṁtalone nannunu
sālu nŏḍam̐barasare sālu nādani
polimido niṁtesibuddi mī rĕram̐ganidā
tālamu sedam̐baṭṭugŏni dām̐ṭanele vāgili
(||āda||)
āna lela pĕṭṭere ādanidom̐ gūḍumani
peni yāna ladanige pĕṭṭarādā
ānuga śhrī veṁkaḍeśhum̐ḍādam̐ḍe nannum̐ gūḍĕ
tenĕluvaṁṭisĕlulu tībulu mīgele