ఆతఁ డు నీకు వెూహించీ నన్నిటా బ త్తిసేసీని
(॥పల్లవి॥)
ఆతఁ డు నీకు వెూహించీ నన్నిటా బ త్తిసేసీని
చేతికి లోనై వుండవే చెప్పితినే బుద్దులు
(॥॥)
వినయములే సేసి వేడుకలు చూపవే
మనసురాఁ బతితోను మాటలాడవే
తనివోవ కేపొద్దు దండఁ గాచుకుండవే
ననువు సేసుకొని నవ్వులెల్లా నవ్వవే
(॥॥)
యెగ్గులు పట్టకువే ఇచ్చకము సేయవే
సిగ్గులివడకువే చెనకితేను
వెగ్గళించి రతులలో వేసట సేయకువే
ఆగ్గమై చన్నుల నొత్తి యట్టె పెనఁగవే
(॥॥)
మొగమెత్తి చూడవే మోహములు చల్లవే
చిగమెవి చూపి చెలఁగించవే
జిగిమించ నంతలోనె శ్రీ వేంకటేశుఁడు గూడె
తగిలి పాయకువే తముల మడుగనే
(||pallavi||)
ādam̐ ḍu nīgu vĕూhiṁchī nanniḍā ba ttisesīni
sedigi lonai vuṁḍave sĕppidine buddulu
(||||)
vinayamule sesi veḍugalu sūbave
manasurām̐ badidonu māḍalāḍave
tanivova kebŏddu daṁḍam̐ gāsuguṁḍave
nanuvu sesugŏni navvulĕllā navvave
(||||)
yĕggulu paṭṭaguve ichchagamu seyave
siggulivaḍaguve sĕnagidenu
vĕggaḽiṁchi radulalo vesaḍa seyaguve
āggamai sannula nŏtti yaṭṭĕ pĕnam̐gave
(||||)
mŏgamĕtti sūḍave mohamulu sallave
sigamĕvi sūbi sĕlam̐giṁchave
jigimiṁcha naṁtalonĕ śhrī veṁkaḍeśhum̐ḍu gūḍĕ
tagili pāyaguve tamula maḍugane