Aadam dokkadi seyagaa atte vogadi seya

ఆతఁ డొక్కటి సేయగా అట్టె వొకటి సేయ
Language

(॥పల్లవి॥)
ఆతఁ డొక్కటి సేయగా అట్టె వొకటి సేయ-
కీతరిఁ జేకొనరాదా యెలయించనేఁటికి

(॥ఆత॥)
ముప్పిరి నీరమణుఁడు మోహములు చల్లఁగాను
రెప్పలెత్తి చూడరాదా రేసులేఁటికి
తెప్పలుగా నవ్వఁగాను తేనె మోవి ఇచ్చి నీవు
దప్పి దేరుచుఁగరాదా తప్పులెంచనేఁటికి

(॥ఆత॥)
చెలఁగి నీమేనబావ చెనకి పిలువఁగాను
పలుకరాదా వట్టిపంతాలేఁటికి
చెలిమి సేయఁగాను చేరి విడెమిచ్చి నీవు
అలపారుచఁగరాదా అడ్డమాడనేఁటికి

(॥ఆత॥)
శ్రీవేంకటేశుఁడు నిన్నుఁ జేకొని కలయఁగాను
సేవలు సేయఁగరాదా సిగ్గు లేఁటికి
యీవల నిన్నురమున యిడుకొని వుండఁగాను
గావించి మెచ్చఁగరాదా పరవశమేఁటికి

(||pallavi||)
ādam̐ ḍŏkkaḍi seyagā aṭṭĕ vŏgaḍi seya-
kīdarim̐ jegŏnarādā yĕlayiṁchanem̐ṭigi

(||āda||)
muppiri nīramaṇum̐ḍu mohamulu sallam̐gānu
rĕppalĕtti sūḍarādā resulem̐ṭigi
tĕppalugā navvam̐gānu tenĕ movi ichchi nīvu
dappi derusum̐garādā tappulĕṁchanem̐ṭigi

(||āda||)
sĕlam̐gi nīmenabāva sĕnagi piluvam̐gānu
palugarādā vaṭṭibaṁtālem̐ṭigi
sĕlimi seyam̐gānu seri viḍĕmichchi nīvu
alabārusam̐garādā aḍḍamāḍanem̐ṭigi

(||āda||)
śhrīveṁkaḍeśhum̐ḍu ninnum̐ jegŏni kalayam̐gānu
sevalu seyam̐garādā siggu lem̐ṭigi
yīvala ninnuramuna yiḍugŏni vuṁḍam̐gānu
gāviṁchi mĕchcham̐garādā paravaśhamem̐ṭigi