Aadam dide neevide aaradiyaala

ఆతఁ డిదె నీవిదె ఆరడియాల
Language

(॥పల్లవి॥)
ఆతఁ డిదె నీవిదె ఆరడియాల
రాతిరిఁ బగలు నిట్టె రతి నోలలాడవే

(॥ఆతఁ॥)
సలిగె గలిగితేను చలము సాదించనేల
చెలిమి సతమైతేను సిగ్గులేల
తలఁపు లొనగూడితే తారుకాణ మరి యాల
మలసి విభునితోను మాఁటలాడఁగదవే

(॥ఆతఁ॥)
ఆసలు నిజమైతేను అలయఁగ మరి యాల
బాసలు దప్పకుండితే పదరనేల
వాసులు రూడికెక్కితే వరుస లెంచఁగనేల
సేసవెట్టినపతికి సేవలెల్లాఁ జేయవే

(॥ఆతఁ॥)
తగులాయమైతేను తరితీపు లవి యాల
మొగమిచ్చకు లోనైతే మొరఁగులేల
నగుతానే వేడుకొని నంటుసేసి నన్నుఁ గూడె
నిగిడి శ్రీవేంకటేశునికి మొక్కుమొక్కవే

(||pallavi||)
ādam̐ ḍidĕ nīvidĕ āraḍiyāla
rādirim̐ bagalu niṭṭĕ radi nolalāḍave

(||ādam̐||)
saligĕ galigidenu salamu sādiṁchanela
sĕlimi sadamaidenu siggulela
talam̐pu lŏnagūḍide tārugāṇa mari yāla
malasi vibhunidonu mām̐ṭalāḍam̐gadave

(||ādam̐||)
āsalu nijamaidenu alayam̐ga mari yāla
bāsalu dappaguṁḍide padaranela
vāsulu rūḍigĕkkide varusa lĕṁcham̐ganela
sesavĕṭṭinabadigi sevalĕllām̐ jeyave

(||ādam̐||)
tagulāyamaidenu taridību lavi yāla
mŏgamichchagu lonaide mŏram̐gulela
nagudāne veḍugŏni naṁṭusesi nannum̐ gūḍĕ
nigiḍi śhrīveṁkaḍeśhunigi mŏkkumŏkkave