ఆతఁ డెంత నీవెంత అంతరము లెంచుకోము
(॥పల్లవి॥)
ఆతఁ డెంత నీవెంత అంతరము లెంచుకోము
చేతికి దొరకనంటా సేవలు సేసేవు
(॥ఆతం॥)
చెలరేఁగి చెలరేఁగి సేసేవు విన్నపాలు
వెలయ నాతఁడు సారె వినీ నంటాను
మెలఁగే వెదుల మందె మేళమున నప్పటిని
నలుగడ నీతో నిట్టె నవ్వీనంటాను
(॥ఆతం॥)
తగిలి తగిలి యాతనిమోము చూచేవు
నిగిడి నీముందరను నిలిచెనంటా
జిగిమించఁ గొనగోరఁ జెనకఁగ వచ్చేవు
వొగి మొగమాటమున నున్నాఁ డంటాను
(॥ఆతం॥)
నానఁబెట్టి నానఁటబెట్టి సయగారాలు చూపేవు
కానిమ్మని నీచేఁతలఁ గైకొనీనంటా
యే నలమేల్మంగను నన్నేలె శ్రీవేంకటేశుఁడు
నీ నేరుపులు చెప్పేవు నిన్ను నిచ్చీనంటాను
(||pallavi||)
ādam̐ ḍĕṁta nīvĕṁta aṁtaramu lĕṁchugomu
sedigi dŏraganaṁṭā sevalu sesevu
(||ādaṁ||)
sĕlarem̐gi sĕlarem̐gi sesevu vinnabālu
vĕlaya nādam̐ḍu sārĕ vinī naṁṭānu
mĕlam̐ge vĕdula maṁdĕ meḽamuna nappaḍini
nalugaḍa nīdo niṭṭĕ navvīnaṁṭānu
(||ādaṁ||)
tagili tagili yādanimomu sūsevu
nigiḍi nīmuṁdaranu nilisĕnaṁṭā
jigimiṁcham̐ gŏnagoram̐ jĕnagam̐ga vachchevu
vŏgi mŏgamāḍamuna nunnām̐ ḍaṁṭānu
(||ādaṁ||)
nānam̐bĕṭṭi nānam̐ṭabĕṭṭi sayagārālu sūbevu
kānimmani nīsem̐talam̐ gaigŏnīnaṁṭā
ye nalamelmaṁganu nannelĕ śhrīveṁkaḍeśhum̐ḍu
nī nerubulu sĕppevu ninnu nichchīnaṁṭānu