Aadam demta neevemta aayamgaa mamdemelamu

ఆతఁ డెంత నీవెంత ఆయఁగా మందెమేళము
Language

(॥పల్లవి॥)
ఆతఁ డెంత నీవెంత ఆయఁగా మందెమేళము
యేతు లాతనిముందర నెంత మెరసేవే

(॥ఆత॥)
అవులేవే కొప్పువిరు లాతని పై రాలఁగను
చెవిలొ విన్నపాలేమి సేసేవే నీవు
జవళిఁ జన్ను మొనలు సారెసారెఁ దాఁకఁగాను
తివిరి కస్తూరియలఁదే విదేమే నీవు

(॥ఆత॥)
జోరునఁ బైఁజెమటలు జొటజొటఁ గారఁగాను
చేరి వూడిగా లేమి సేసేవే నీవు
గోరికొన శిరసుపై కురులలొ నూఁదుకొంటా
సారెఁ గొప్పు దువ్వేవేము సందుసుడి నీవు

(॥ఆత॥)
అలరి నీనిట్టూరుపు లాతనిమై సోఁకఁగాను
చెలఁగి మచ్చిక లేమిసేసేవే నీవు
అలమేలుమంగపతియైన శ్రీవేంకటేశుఁడు
వొలిసి నన్నేలె నేమి వొరసేవే నీవు

(||pallavi||)
ādam̐ ḍĕṁta nīvĕṁta āyam̐gā maṁdĕmeḽamu
yedu lādanimuṁdara nĕṁta mĕraseve

(||āda||)
avuleve kŏppuviru lādani pai rālam̐ganu
sĕvilŏ vinnabālemi seseve nīvu
javaḽim̐ jannu mŏnalu sārĕsārĕm̐ dām̐kam̐gānu
tiviri kastūriyalam̐de videme nīvu

(||āda||)
jorunam̐ baim̐jĕmaḍalu jŏḍajŏḍam̐ gāram̐gānu
seri vūḍigā lemi seseve nīvu
gorigŏna śhirasubai kurulalŏ nūm̐dugŏṁṭā
sārĕm̐ gŏppu duvvevemu saṁdusuḍi nīvu

(||āda||)
alari nīniṭṭūrubu lādanimai som̐kam̐gānu
sĕlam̐gi machchiga lemiseseve nīvu
alamelumaṁgabadiyaina śhrīveṁkaḍeśhum̐ḍu
vŏlisi nannelĕ nemi vŏraseve nīvu