Aadam demi sesinaanu amtaa namta valabe

ఆతఁ డేమి సేసినాను అంతా నంత వలపే
Language

(॥పల్లవి॥)
ఆతఁ డేమి సేసినాను అంతా నంత వలపే
కాతరించక మొక్కవే కమ్మర నీ విపుడు

(॥ఆతఁ॥)
దగ్గరఁ గూచుండి ని న్నాతఁడు వేఁడుకొనఁగాను
సిగ్గులు వడకువే చెలియా
వెగ్గళించి నిమ్మపంట వేసె నందరిలోనంటా
యెగ్గులుగాఁ బట్టకువే యెదిరించి ఇపుడు

(॥ఆతఁ॥)
వుమ్మగిలు రతులకు నొడివట్టి పెనఁగఁగా
బొమ్మల జంకించకువే పొలఁతీ
కమ్మటి నీ కుచములు కడుఁబిసికెనంటాను
కుమ్మెలువో నూఁదకువే కొనగోర నిపుడు

(॥ఆతఁ॥)
శ్రీవేంకటేశుఁడు నిన్నుఁ జేరి కాఁగిలించుకోఁగా
మోవి గంటిసేయకువే ముదితా
కైవసమై నీ మనసు కరఁగించె నితఁడంటా
వేవేలుగా దూరకువే వేడుకతో నిపుడు

(||pallavi||)
ādam̐ ḍemi sesinānu aṁtā naṁta valabe
kādariṁchaga mŏkkave kammara nī vibuḍu

(||ādam̐||)
daggaram̐ gūsuṁḍi ni nnādam̐ḍu vem̐ḍugŏnam̐gānu
siggulu vaḍaguve sĕliyā
vĕggaḽiṁchi nimmabaṁṭa vesĕ naṁdarilonaṁṭā
yĕggulugām̐ baṭṭaguve yĕdiriṁchi ibuḍu

(||ādam̐||)
vummagilu radulagu nŏḍivaṭṭi pĕnam̐gam̐gā
bŏmmala jaṁkiṁchaguve pŏlam̐tī
kammaḍi nī kusamulu kaḍum̐bisigĕnaṁṭānu
kummĕluvo nūm̐daguve kŏnagora nibuḍu

(||ādam̐||)
śhrīveṁkaḍeśhum̐ḍu ninnum̐ jeri kām̐giliṁchugom̐gā
movi gaṁṭiseyaguve mudidā
kaivasamai nī manasu karam̐giṁchĕ nidam̐ḍaṁṭā
vevelugā dūraguve veḍugado nibuḍu