ఆతఁ డేమి చెప్పినాను అట్టే సేతువుగాని
(॥పల్లవి॥)
ఆతఁ డేమి చెప్పినాను అట్టే సేతువుగాని
చేతికి విడెమియ్యఁగా సిగ్గులు వడకువే
(॥అత॥)
యెనసివుండినవారి కిచ్చకములే పోడము
ననుపుగలుగుచోట నాటుఁ బ్రేమము
పెనఁగఁగ బెనఁగఁగా ప్రియములు పెచ్చురేఁగు
చెనకితే విభునితో సిగ్గులువడకువే
(॥అత॥)
మంతనాన నుండఁగాను మనసుసు గరఁగును
వింత సేయకుండితేనే వేడుక నిండు
సంతసించి మాటాడితే చవులు దానే పుట్టు
చెంత నాతఁడేమనినా సిగ్గులువడకువే
(॥అత॥)
తలఁపులు సరియైతేఁ దమకము లుప్పతిల్లు
కలయిక లబ్బితేను కైవశమౌను
అలమె శ్రీవేంకటేశుఁ డలమేల్‌మంగవు నీవు
చెలికత్తేల ముందర సిగ్గులువడకువే
(||pallavi||)
ādam̐ ḍemi sĕppinānu aṭṭe seduvugāni
sedigi viḍĕmiyyam̐gā siggulu vaḍaguve
(||ada||)
yĕnasivuṁḍinavāri kichchagamule poḍamu
nanubugalugusoḍa nāḍum̐ bremamu
pĕnam̐gam̐ga bĕnam̐gam̐gā priyamulu pĕchchurem̐gu
sĕnagide vibhunido sigguluvaḍaguve
(||ada||)
maṁtanāna nuṁḍam̐gānu manasusu garam̐gunu
viṁta seyaguṁḍidene veḍuga niṁḍu
saṁtasiṁchi māḍāḍide savulu dāne puṭṭu
sĕṁta nādam̐ḍemaninā sigguluvaḍaguve
(||ada||)
talam̐pulu sariyaidem̐ damagamu luppadillu
kalayiga labbidenu kaivaśhamaunu
alamĕ śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁgavu nīvu
sĕligattela muṁdara sigguluvaḍaguve