Aadam deedane vunnaamdu adugare

ఆతఁ డీడనే వున్నాఁడు అడుగరే
Language

(॥పల్లవి॥)
ఆతఁ డీడనే వున్నాఁడు అడుగరే
నీతితోడ నన్నునేల నేరమెంచేరే

(॥ఆత॥)
మొగము చూచినఁగాక మోహమెట్టు గానవచ్చు
నగినఁగా కెటు లామన్నన దెలుసు
తగులనాడినఁగాక దగ్గర నెట్లవచ్చు
నిగుడి మీరేల నన్ను నేరమెంచేరే

(॥ఆత॥)
మచ్చిక చల్లినఁగాక మాఁటలెట్లా నాడవచ్చు
ముచ్చటలాడక యెట్లు మొక్కవచ్చును
మెచ్చకతొలుతనే మేలమెట్లా నాడవచ్చు
నెచ్చెలు లిందరునేల నేరమెంచేరే

(॥ఆత॥)
చెలిమి సేసినఁగాక చెనకఁగ నెట్టువచ్చు
పిలువకతొల్లే యెట్టు పెనఁగవచ్చు
అలమి శ్రీవేంకటేశుఁ డంతలోనే నన్నుఁ గూడె
నెలకొని యిప్పుడేల నేరమెంచేరే

(||pallavi||)
ādam̐ ḍīḍane vunnām̐ḍu aḍugare
nīdidoḍa nannunela neramĕṁchere

(||āda||)
mŏgamu sūsinam̐gāga mohamĕṭṭu gānavachchu
naginam̐gā kĕḍu lāmannana dĕlusu
tagulanāḍinam̐gāga daggara nĕṭlavachchu
niguḍi mīrela nannu neramĕṁchere

(||āda||)
machchiga sallinam̐gāga mām̐ṭalĕṭlā nāḍavachchu
muchchaḍalāḍaga yĕṭlu mŏkkavachchunu
mĕchchagadŏludane melamĕṭlā nāḍavachchu
nĕchchĕlu liṁdarunela neramĕṁchere

(||āda||)
sĕlimi sesinam̐gāga sĕnagam̐ga nĕṭṭuvachchu
piluvagadŏlle yĕṭṭu pĕnam̐gavachchu
alami śhrīveṁkaḍeśhum̐ ḍaṁtalone nannum̐ gūḍĕ
nĕlagŏni yippuḍela neramĕṁchere