Aadam dampinane gaaga namdaamkaam badara nela

ఆతఁ డంపిననే గాక నందాఁకాఁ బదర నేల
Language

(॥పల్లవి॥)
ఆతఁ డంపిననే గాక నందాఁకాఁ బదర నేల
నీతి గాదు మొదలనే నీకుఁ గోప మేటికీ

(॥ఆత॥)
మొక్కితే నేమాయనే మోహపుఁ బతికీవేళ
మొక్కిన చేయిగోరిమీఁద ముక్క పోయీనా
నిక్కి ప్రియముచెప్పితే నేఁటిలో నేమాయనే
దిక్కన కప్రపునోరఁ దినరాదా కారము

(॥ఆత॥)
కన్నుల నవ్వితే నేమే కపటాలు గంటేను ఆ
కన్నులచే కాఁక చల్లఁ గా దనేరా
సన్నల మెచ్చితే నేమే సరవి దప్పినవేళ
సన్నసేసినపతిని జంకించరాదా

(॥ఆత॥)
కౌఁగిట నించితే నేమే గర్వము చూపినవేళ
కౌఁగిటి రతులలోనే కరఁచ రాదా
పాఁగిన శ్రీవేంకటాద్రిపతి నన్ను నిట్టే కూడె
వీఁగ నలమేల్మంగను వెఱగంద రాదా

(||pallavi||)
ādam̐ ḍaṁpinane gāga naṁdām̐kām̐ badara nela
nīdi gādu mŏdalane nīgum̐ goba meḍigī

(||āda||)
mŏkkide nemāyane mohabum̐ badigīveḽa
mŏkkina seyigorimīm̐da mukka poyīnā
nikki priyamusĕppide nem̐ṭilo nemāyane
dikkana kaprabunoram̐ dinarādā kāramu

(||āda||)
kannula navvide neme kabaḍālu gaṁṭenu ā
kannulase kām̐ka sallam̐ gā danerā
sannala mĕchchide neme saravi dappinaveḽa
sannasesinabadini jaṁkiṁcharādā

(||āda||)
kaum̐giḍa niṁchide neme garvamu sūbinaveḽa
kaum̐giḍi radulalone karam̐sa rādā
pām̐gina śhrīveṁkaḍādribadi nannu niṭṭe kūḍĕ
vīm̐ga nalamelmaṁganu vĕṟagaṁda rādā