ఆతఁ డదె నిలుచున్నాఁ డండకు బిలుచుకోవే
(॥పల్లవి॥)
ఆతఁ డదె నిలుచున్నాఁ డండకు బిలుచుకోవే
నాతులకుఁ బతితోడి ననుపులే మేలు
(॥ఆతఁ॥)
తెగరానిచోటులకు తియ్యనిమాటలే మేలు
మొగదానికిరైన య(యె?)డ మొక్కులే మేలు
తగవు దప్పనియందు తాలిములే మేలు
వెగటేల పతికిఁక వీడె మియ్యవే
(॥ఆతఁ॥)
యెదురాడరానిచోట నియ్యకొనుటే మేలు
వదలనిపొందులకు వాడికే మేలు
చెదరవి యాసలైతే సిగ్గులువడుటే మేలు
పదరకిట్టె పతికిఁ బాదాలొత్తవే
(॥ఆతఁ॥)
గుట్టు విడువనిచోట కూడియుండుటే మేలు
మట్టుమీరరానిచోట మచ్చికే మేలు
నెట్టన నలమేల్మంగ నీకు నిన్నిటామేలు
యిట్టె శ్రీవేంకటేశు కితవుతోఁ గూడవే
(||pallavi||)
ādam̐ ḍadĕ nilusunnām̐ ḍaṁḍagu bilusugove
nādulagum̐ badidoḍi nanubule melu
(||ādam̐||)
tĕgarānisoḍulagu tiyyanimāḍale melu
mŏgadānigiraina ya(yĕ?)ḍa mŏkkule melu
tagavu dappaniyaṁdu tālimule melu
vĕgaḍela padigim̐ka vīḍĕ miyyave
(||ādam̐||)
yĕdurāḍarānisoḍa niyyagŏnuḍe melu
vadalanibŏṁdulagu vāḍige melu
sĕdaravi yāsalaide sigguluvaḍuḍe melu
padaragiṭṭĕ padigim̐ bādālŏttave
(||ādam̐||)
guṭṭu viḍuvanisoḍa kūḍiyuṁḍuḍe melu
maṭṭumīrarānisoḍa machchige melu
nĕṭṭana nalamelmaṁga nīgu ninniḍāmelu
yiṭṭĕ śhrīveṁkaḍeśhu kidavudom̐ gūḍave