ఆతఁ డదె నే నిదె ఆసలు మిగిలెను
(॥పల్లవి॥)
ఆతఁ డదె నే నిదె ఆసలు మిగిలెను
మతకము మాన్పరే మన్నన చెలులూ
(॥ఆతఁ॥)
తిరమగునామాఁట తేనెలు గురియఁగ
తరితీపు లీతఁడు తాఁ గురిసె
సరి మాలో మొగచాటులాయ నిదె
వెరవులు చెప్పరే వేడుకచెలులూ
(॥ఆతఁ॥)
కొనచూపుల నే కుంకుమ చల్లఁగ
వొనరఁదా నవ్వుపువ్వులు చల్లె
యినుమడించి మాకివె చలువలాయ
పొనుగక చెప్పరే బుద్దులు చెలులూ
(॥ఆతఁ॥)
వావిరి నా కిదె వలపులు గూడఁగ
శ్రీవేంకటేశుఁడు జిగిఁ గూడె
బావము లిందునే బడిఁ దగులాయను
యీవల మెచ్చరే యిదివో చెలులూ
(||pallavi||)
ādam̐ ḍadĕ ne nidĕ āsalu migilĕnu
madagamu mānpare mannana sĕlulū
(||ādam̐||)
tiramagunāmām̐ṭa tenĕlu guriyam̐ga
taridību līdam̐ḍu tām̐ gurisĕ
sari mālo mŏgasāḍulāya nidĕ
vĕravulu sĕppare veḍugasĕlulū
(||ādam̐||)
kŏnasūbula ne kuṁkuma sallam̐ga
vŏnaram̐dā navvubuvvulu sallĕ
yinumaḍiṁchi māgivĕ saluvalāya
pŏnugaga sĕppare buddulu sĕlulū
(||ādam̐||)
vāviri nā kidĕ valabulu gūḍam̐ga
śhrīveṁkaḍeśhum̐ḍu jigim̐ gūḍĕ
bāvamu liṁdune baḍim̐ dagulāyanu
yīvala mĕchchare yidivo sĕlulū