Aadam daadumanagaane aadidi ne neemaada

ఆతఁ డాడుమనగానే ఆడితి నే నీమాట
Language

(॥పల్లవి॥)
ఆతఁ డాడుమనగానే ఆడితి నే నీమాట
కాతరాన లోన వాఁడే కైకొనఁగరాదా

(॥ఆత॥)
పయ్యదేల మూసేవే పడఁతి నీచన్ను లవి
వొయ్యన జక్కవలంత వుబ్బ కోర్చునా
వుయ్యాలమంచముమీఁద వొరసేనీనాయకుని
కొయ్యరతుల కాఁగిటి గూఁటఁ బెట్టరాదా

(॥ఆత॥)
రెప్పలేల వేసేవే రేసుల నీకనుచూపు-
ముప్పిరిచకోరాలు మూలనుండునా
కప్పరపుమేడలోనఁ గదిసేనీరమణుని-
దెప్పరపు మేననే దండెన వేయరాదా

(॥ఆత॥)
తురుమేల ముడిచేవే తుమ్మిదలఁ బిసికితే
మరుగునా అలమేలుమంగవు నీవు
పరపుపై శ్రీవేంకటపతిఁ గాఁగిటఁ గూడితి-
వరయఁగ నాతనిపై నాట నేర్పరాదా

(||pallavi||)
ādam̐ ḍāḍumanagāne āḍidi ne nīmāḍa
kādarāna lona vām̐ḍe kaigŏnam̐garādā

(||āda||)
payyadela mūseve paḍam̐ti nīsannu lavi
vŏyyana jakkavalaṁta vubba korsunā
vuyyālamaṁchamumīm̐da vŏrasenīnāyaguni
kŏyyaradula kām̐giḍi gūm̐ṭam̐ bĕṭṭarādā

(||āda||)
rĕppalela veseve resula nīganusūbu-
muppirisagorālu mūlanuṁḍunā
kapparabumeḍalonam̐ gadisenīramaṇuni-
dĕpparabu menane daṁḍĕna veyarādā

(||āda||)
turumela muḍiseve tummidalam̐ bisigide
marugunā alamelumaṁgavu nīvu
parabubai śhrīveṁkaḍabadim̐ gām̐giḍam̐ gūḍidi-
varayam̐ga nādanibai nāḍa nerbarādā