Aadagum boyiraavayyaa annee vinnavimchemgaani

ఆడకుఁ బోయిరావయ్యా అన్నీ విన్నవించేఁగాని
Language

(॥పల్లవి॥)
ఆడకుఁ బోయిరావయ్యా అన్నీ విన్నవించేఁగాని
యీడ మాతోడి పొందులు యేకాలముఁ గలవే

(॥ఆడ॥)
చిత్తము రంజిల్ల నీవే చెప్పినట్టల్లాఁ జేసి
మెత్తనిమాట లాడి మెప్పించె నాపె
గుత్తపు గుబ్బలు పోఁక కొప్పు నీకుఁ జక్కఁబెట్టి
చిత్తజకేళికి నిన్నుఁ జిమ్మిరేఁచె నాపె

(॥ఆడ॥)
తనపైఁ బరాకుసేసి తమి నీకు బుట్టించి
వినయములనే దక్కఁగొనె నిన్నాపె
కొనగోలు మోవ చెక్కుఁలను జవ్వాది మెత్తి
కనుసన్న రతులకుఁ గైకొలిపె నాపె

(॥ఆడ॥)
తెమఱఁగుకుఁ దీసి తియ్యనిమోవి యొసగి
మరిగించె నలమేలుమంగే యాపె
గరిమ శ్రీవేంకటేశ కలసితి విటు నన్ను
సరసపునవ్వులు చవిచూపె నాపె

(||pallavi||)
āḍagum̐ boyirāvayyā annī vinnaviṁchem̐gāni
yīḍa mādoḍi pŏṁdulu yegālamum̐ galave

(||āḍa||)
sittamu raṁjilla nīve sĕppinaṭṭallām̐ jesi
mĕttanimāḍa lāḍi mĕppiṁchĕ nābĕ
guttabu gubbalu pom̐ka kŏppu nīgum̐ jakkam̐bĕṭṭi
sittajageḽigi ninnum̐ jimmirem̐sĕ nābĕ

(||āḍa||)
tanabaim̐ barāgusesi tami nīgu buṭṭiṁchi
vinayamulane dakkam̐gŏnĕ ninnābĕ
kŏnagolu mova sĕkkum̐lanu javvādi mĕtti
kanusanna radulagum̐ gaigŏlibĕ nābĕ

(||āḍa||)
tĕmaṟam̐gugum̐ dīsi tiyyanimovi yŏsagi
marigiṁchĕ nalamelumaṁge yābĕ
garima śhrīveṁkaḍeśha kalasidi viḍu nannu
sarasabunavvulu savisūbĕ nābĕ