ఆడకే వచ్చెఁ బోవే అంతే చాలు
(॥పల్లవి॥)
ఆడకే వచ్చెఁ బోవే అంతే చాలు
యీడుజోడుఁ జెప్పకువే ఇంతే చాలు
(॥॥)
కన్నులనే చూచితివి కాఁకలు చల్లితివి
అన్నిటా నేమీ ననకు మంతే చాలు
సన్నల నవ్వితివి చాయలు మొక్కితివి
యెన్నికలు నరివచ్చె నింతే చాలు
(॥॥)
బొమ్మల జింకించితివి పొద్దూఁ గడపితివి
అమ్మకువే వావులు నేఁ డంతే చాలు
చిమ్మితివి మాఁటలు సేసితివి నీఁటులు
యెమ్మె లింకఁ గొలుపవు యింతే చాలు
(॥॥)
దగ్గరికి వచ్చితి దవ్వుల మెచ్చితివి
అగ్గలమాయఁ జెమట అంతే చాలు
బగ్గన శ్రీ వేంకటాద్రిపతి నేఁడు కూడె నిన్ను
యెగ్గుసిగ్గు లిఁకనేలే యింతే చాలు
(||pallavi||)
āḍage vachchĕm̐ bove aṁte sālu
yīḍujoḍum̐ jĕppaguve iṁte sālu
(||||)
kannulane sūsidivi kām̐kalu sallidivi
anniḍā nemī nanagu maṁte sālu
sannala navvidivi sāyalu mŏkkidivi
yĕnnigalu narivachchĕ niṁte sālu
(||||)
bŏmmala jiṁkiṁchidivi pŏddūm̐ gaḍabidivi
ammaguve vāvulu nem̐ ḍaṁte sālu
simmidivi mām̐ṭalu sesidivi nīm̐ṭulu
yĕmmĕ liṁkam̐ gŏlubavu yiṁte sālu
(||||)
daggarigi vachchidi davvula mĕchchidivi
aggalamāyam̐ jĕmaḍa aṁte sālu
baggana śhrī veṁkaḍādribadi nem̐ḍu kūḍĕ ninnu
yĕggusiggu lim̐kanele yiṁte sālu