(॥పల్లవి॥)
ఆడా నీడా నదివో రమణుఁడు
వేడుకలు రేఁచీ వింటి నేననవే
(॥॥)
కానీకానీ కసుగాటుమాఁటలు
నానఁబెట్టీని నాతోను
రానీపోనీ రాజస మెఁతైనా
మానఁడెంతయినా మఱవకుమనవే
(॥॥)
మేలుమేలు మేనరికమే నాకుఁ
జాలాఁ గట్టెను సరసానకు
మూలమూలా ముసిముసినవ్వులు
చాలుకొనెనట సరిదాఁకెననవే
(॥॥)
నవ్వి నవ్వి నను శ్రీ వేంకటపతి
జవ్వనము రేఁచి సరిఁగూడెను
దవ్వులటు మాని దగ్గరి నా వద్దఁ
బవ్వళించెను పదరకుమనవే
(||pallavi||)
āḍā nīḍā nadivo ramaṇum̐ḍu
veḍugalu rem̐sī viṁṭi nenanave
(||||)
kānīgānī kasugāḍumām̐ṭalu
nānam̐bĕṭṭīni nādonu
rānībonī rājasa mĕm̐tainā
mānam̐ḍĕṁtayinā maṟavagumanave
(||||)
melumelu menarigame nāgum̐
jālām̐ gaṭṭĕnu sarasānagu
mūlamūlā musimusinavvulu
sālugŏnĕnaḍa saridām̐kĕnanave
(||||)
navvi navvi nanu śhrī veṁkaḍabadi
javvanamu rem̐si sarim̐gūḍĕnu
davvulaḍu māni daggari nā vaddam̐
bavvaḽiṁchĕnu padaragumanave