Aabeṟumgu nee veṟumgu daaloni panulella

ఆపెఱుఁగు నీ వెఱుఁగు దాలోని పనులెల్ల
Language

(॥పల్లవి॥)
ఆపెఱుఁగు నీ వెఱుఁగు దాలోని పనులెల్ల
యేపున విన్నవించితి మిదిగో చెలులము

(॥ఆపె॥)
యేమని చెప్పెంపుదువో యేవేళ వత్తువో యని
కామిని యాడ నీవేళ గాచుకున్నది
నీమన సెట్టువచ్చునో నీవూడిగ మబ్బుటెట్టో
యీమేర నుందాననని యెంచుకొంటా నున్నది

(॥ఆపె॥)
యెప్పుడుమోము చూతువో యేసన్నసేతువోయని
చొప్పుగా నీవంకే చూచుకవున్నది
మెప్పించుకొందునో నీవు మేలమాడుదువోయని
చప్పు డాలించుకొంటా నచ్చట నదె వున్నది

(॥ఆపె॥)
కందువకుఁ బిల్తువో ఇక్కడఁ గూడుదువోయని
పొంది నీపానుపుమీఁదఁ బొంచుకున్నది
అందపు శ్రీవేంకటేశ అలమేలుమంగ యీకె
చెంది నీకాఁగిటఁ గూడి చెలరేఁగుచున్నది

(||pallavi||)
ābĕṟum̐gu nī vĕṟum̐gu dāloni panulĕlla
yebuna vinnaviṁchidi midigo sĕlulamu

(||ābĕ||)
yemani sĕppĕṁpuduvo yeveḽa vattuvo yani
kāmini yāḍa nīveḽa gāsugunnadi
nīmana sĕṭṭuvachchuno nīvūḍiga mabbuḍĕṭṭo
yīmera nuṁdānanani yĕṁchugŏṁṭā nunnadi

(||ābĕ||)
yĕppuḍumomu sūduvo yesannaseduvoyani
sŏppugā nīvaṁke sūsugavunnadi
mĕppiṁchugŏṁduno nīvu melamāḍuduvoyani
sappu ḍāliṁchugŏṁṭā nachchaḍa nadĕ vunnadi

(||ābĕ||)
kaṁduvagum̐ bilduvo ikkaḍam̐ gūḍuduvoyani
pŏṁdi nībānubumīm̐dam̐ bŏṁchugunnadi
aṁdabu śhrīveṁkaḍeśha alamelumaṁga yīgĕ
sĕṁdi nīgām̐giḍam̐ gūḍi sĕlarem̐gusunnadi