(॥పల్లవి॥)
ఆపెఱఁగదా నీయంతరంగము
చూపి చూపి అంతేసి చొప్పులెత్తవలెనా
(॥ఆపె॥)
సిగ్గువడ్డభావానకు చిఱునవ్వులే యెఱుక
యెగ్గులెంచనియందుకు ఇంపు లెఱక
వొగ్గినరతులకును వూరకుండుటే యెఱుక
అగ్గలమై విచ్చి విచ్చి ఆనతియ్యవలెనా
(॥ఆపె॥)
చెప్పరాని మాటలకు చేసన్నలే యెఱుక
ముప్పిరివలపులకు మొక్కు లెఱుక
అప్పసమై ఆసలకు ఆయములంటు టెఱుక
అప్పటిని పేరుకొని ఆనతియ్యవలెనా
(॥ఆపె॥)
చేతికి లోనైనందుకు చెలరేఁగుటే యెఱుక
కాతరముగలందులకు ఘాత లెఱుక
యేతులశ్రీవేంకటేశ ఇద్దరునుఁ గూడితిరి
ఆతలీతలిమాకెల్లా నానతియ్యవలెనా
(||pallavi||)
ābĕṟam̐gadā nīyaṁtaraṁgamu
sūbi sūbi aṁtesi sŏppulĕttavalĕnā
(||ābĕ||)
sigguvaḍḍabhāvānagu siṟunavvule yĕṟuga
yĕggulĕṁchaniyaṁdugu iṁpu lĕṟaga
vŏgginaradulagunu vūraguṁḍuḍe yĕṟuga
aggalamai vichchi vichchi ānadiyyavalĕnā
(||ābĕ||)
sĕpparāni māḍalagu sesannale yĕṟuga
muppirivalabulagu mŏkku lĕṟuga
appasamai āsalagu āyamulaṁṭu ṭĕṟuga
appaḍini perugŏni ānadiyyavalĕnā
(||ābĕ||)
sedigi lonainaṁdugu sĕlarem̐guḍe yĕṟuga
kādaramugalaṁdulagu ghāda lĕṟuga
yedulaśhrīveṁkaḍeśha iddarunum̐ gūḍidiri
ādalīdalimāgĕllā nānadiyyavalĕnā