Aabenela vuppadimche rammalaala

ఆపెనేల వుప్పతించే రమ్మలాల
Language

(॥పల్లవి॥)
ఆపెనేల వుప్పతించే రమ్మలాల
యేపున వయసువచ్చి యెదుట నుండఁగను

(॥॥)
యెలమి నెవ్వరిభాగ్య మెట్టు దెలియఁగవచ్చు
మొలకచన్నులెకావా మోపులయ్యేది
కలిగినయట్టికాలగతు లెట్టు చెప్పఁగవచ్చు
పలచనిమోవిఁగాదా పండి తేనె లూరేది

(॥॥)
యెఱిఁగి యెవ్వరికొలఁ దెట్టు గురివెట్టవచ్చు
నెఱులు పెరిగికాదా నిడుపయ్యేవి
మెఱసి దొరతనముమితి యెట్టు వెట్టవచ్చు
పిఱుఁదు బలిసిగాదా పిక్కటిల్లేది

(॥॥)
యెన్నఁగ నెవ్వరిబిర మేరుపరచే దెట్టు
కన్నులచూపులేకావా కాఁడిపారేవి
యిన్నిటా శ్రీ వేంకటేశుఁ డీకెను నన్నును గూడె
వున్నతిఁ జేదోయేకాదా వొక్కకాఁగి లయ్యేది

(||pallavi||)
ābĕnela vuppadiṁche rammalāla
yebuna vayasuvachchi yĕduḍa nuṁḍam̐ganu

(||||)
yĕlami nĕvvaribhāgya mĕṭṭu dĕliyam̐gavachchu
mŏlagasannulĕgāvā mobulayyedi
kaliginayaṭṭigālagadu lĕṭṭu sĕppam̐gavachchu
palasanimovim̐gādā paṁḍi tenĕ lūredi

(||||)
yĕṟim̐gi yĕvvarigŏlam̐ dĕṭṭu gurivĕṭṭavachchu
nĕṟulu pĕrigigādā niḍubayyevi
mĕṟasi dŏradanamumidi yĕṭṭu vĕṭṭavachchu
piṟum̐du balisigādā pikkaḍilledi

(||||)
yĕnnam̐ga nĕvvaribira merubarase dĕṭṭu
kannulasūbulegāvā kām̐ḍibārevi
yinniḍā śhrī veṁkaḍeśhum̐ ḍīgĕnu nannunu gūḍĕ
vunnadim̐ jedoyegādā vŏkkagām̐gi layyedi