Aabegu neegum delusu namtaramgabu suddulu

ఆపెకు నీకుఁ దెలుసు నంతరంగపు సుద్దులు
Language

(॥పల్లవి॥)
ఆపెకు నీకుఁ దెలుసు నంతరంగపు సుద్దులు
కోపగించఁ బనిలేదు గోవిందరాజ

(॥ఆపె॥)
యెంత చనవిచ్చితివో యీపెకు నీవు నేఁడు
వంతులు వాసులుఁ బట్టీ వడిగా నీతో
పంతగత్తె గానోపు పలుమారు నీకె నిన్ను
కొంతపుఁ జూపులఁ జూచీ గోవిందరాజ

(॥ఆపె॥)
యేరీతి వొడఁబాటో యీకెనీసందిఁ దొల్లి
మేరతో మాటాడి మందెమేళముఁ జూపీ
నేరుపరి గాఁబోలు నిన్నుఁ గుడుఁబచారించి
కూరిములు గొసరీని గోవిందరాజ

(॥ఆపె॥)
బాసలేమి సేసితివో పలుమారు నీకె నీతో
రాసికెక్కఁ గూడి మేరలు మీరీని
వేసాలది గాఁబోలు శ్రీవేంకటాద్రి నన్నేలఁగా
గోస నాసచేసీని గోవిందరాజ

(||pallavi||)
ābĕgu nīgum̐ dĕlusu naṁtaraṁgabu suddulu
kobagiṁcham̐ baniledu goviṁdarāja

(||ābĕ||)
yĕṁta sanavichchidivo yībĕgu nīvu nem̐ḍu
vaṁtulu vāsulum̐ baṭṭī vaḍigā nīdo
paṁtagattĕ gānobu palumāru nīgĕ ninnu
kŏṁtabum̐ jūbulam̐ jūsī goviṁdarāja

(||ābĕ||)
yerīdi vŏḍam̐bāḍo yīgĕnīsaṁdim̐ dŏlli
merado māḍāḍi maṁdĕmeḽamum̐ jūbī
nerubari gām̐bolu ninnum̐ guḍum̐basāriṁchi
kūrimulu gŏsarīni goviṁdarāja

(||ābĕ||)
bāsalemi sesidivo palumāru nīgĕ nīdo
rāsigĕkkam̐ gūḍi meralu mīrīni
vesāladi gām̐bolu śhrīveṁkaḍādri nannelam̐gā
gosa nāsasesīni goviṁdarāja