(॥పల్లవి॥)
ఆపెకు నీకు నెంత అరువడమో
రేపును మాపునుఁ దమి రేఁచీని
(॥ఆప॥)
ప్రియమైన సేసపాల పెండ్లికూఁతురు నీతో
నయగారిమాటలాడి నవ్వించీని
రయమునఁ బానుపుపై రాతిరిఁ బగలు నుండి
క్రియగూ డారతులను కెరలించీని
(॥ఆప॥)
దోమటి గలసినట్టి దొడ్డదేవులు నీతో
కోమలపు చూపుచూచి కొసరీని
కామించి పైఁడిపీఁటపై కలకాలమునుండి
చేముంచి సరసములఁ జిక్కించీని
(॥ఆప॥)
అట్టే వురమెక్కినట్టి యలమేలుమంగ నీతో
రట్టిడితనానఁ గూడాఱడిఁ బెట్టీని
గట్టిగా శ్రీవేంకటేశ కాఁగిట సదా వుండి
జట్టిగొన్న సిగ్గులను చవి వుట్టించీని
(||pallavi||)
ābĕgu nīgu nĕṁta aruvaḍamo
rebunu mābunum̐ dami rem̐sīni
(||āba||)
priyamaina sesabāla pĕṁḍligūm̐turu nīdo
nayagārimāḍalāḍi navviṁchīni
rayamunam̐ bānububai rādirim̐ bagalu nuṁḍi
kriyagū ḍāradulanu kĕraliṁchīni
(||āba||)
domaḍi galasinaṭṭi dŏḍḍadevulu nīdo
komalabu sūbusūsi kŏsarīni
kāmiṁchi paim̐ḍibīm̐ṭabai kalagālamunuṁḍi
semuṁchi sarasamulam̐ jikkiṁchīni
(||āba||)
aṭṭe vuramĕkkinaṭṭi yalamelumaṁga nīdo
raṭṭiḍidanānam̐ gūḍāṟaḍim̐ bĕṭṭīni
gaṭṭigā śhrīveṁkaḍeśha kām̐giḍa sadā vuṁḍi
jaṭṭigŏnna siggulanu savi vuṭṭiṁchīni