Aabegu namarunaa aaradi nee panulu

ఆపెకు నమరునా ఆరడి నీ పనులు
Language

(॥పల్లవి॥)
ఆపెకు నమరునా ఆరడి నీ పనులు
వోపిక గలవాఁడవు వోయమ్మ వెరవవు

(॥ఆపె॥)
సిగ్గువడివున్న చెలిఁ జెక్కు నొక్కఁబోతే
అగ్గలము గాదా అందరిలోన
యెగ్గులోని ప్రోడదొర వెఱఁగరాదు నీకైతే
వొగ్గేవు నీవెందుకైనా వోయమ్మ వెరవవు

(॥ఆపె॥)
పాయపుఁ గోమలితోడఁ బట్టి వెనఁగఁగఁబోతే
రాయడివలె నుండదా రచ్చలోనను
మాయదారి మగఁడవు మఱఁగులేదు నీకైతే
వోయయ్య ఆడికలకు నోయమ్మ వెరవవు

(॥ఆపె॥)
గుట్టుతోడి వనితను కొంగువట్టి తియ్యఁబోతే
దిట్టతనమై వుండదా తెఱవలలో
ఇట్టి శ్రీ వేంకటేశ యీపె నిట్టె కూడితివి
వొట్టు సత్యములకును వోయమ్మ వెఱవవు

(||pallavi||)
ābĕgu namarunā āraḍi nī panulu
vobiga galavām̐ḍavu voyamma vĕravavu

(||ābĕ||)
sigguvaḍivunna sĕlim̐ jĕkku nŏkkam̐bode
aggalamu gādā aṁdarilona
yĕgguloni proḍadŏra vĕṟam̐garādu nīgaide
vŏggevu nīvĕṁdugainā voyamma vĕravavu

(||ābĕ||)
pāyabum̐ gomalidoḍam̐ baṭṭi vĕnam̐gam̐gam̐bode
rāyaḍivalĕ nuṁḍadā rachchalonanu
māyadāri magam̐ḍavu maṟam̐guledu nīgaide
voyayya āḍigalagu noyamma vĕravavu

(||ābĕ||)
guṭṭudoḍi vanidanu kŏṁguvaṭṭi tiyyam̐bode
diṭṭadanamai vuṁḍadā tĕṟavalalo
iṭṭi śhrī veṁkaḍeśha yībĕ niṭṭĕ kūḍidivi
vŏṭṭu satyamulagunu voyamma vĕṟavavu