ఆపెకు మాకును నేఁడు అంతర మెంత
(॥పల్లవి॥)
ఆపెకు మాకును నేఁడు అంతర మెంత
కాఁపురాలు వేరె వేరె కనుకొంట గాక
(॥ఆపె॥)
మాటలమందులు నూరి మరిగించుకొనె నాపె
యీటు వెట్టుకోము నేము ఇల్లాండ్లము
చీటికి మాటికి నీతో సిగ్గులు వీడీని నాపె
కూటముల నేమైతే గుట్టుగలవారము
(॥ఆపె॥)
చెవిలో మంత్రాలు చెప్పి చే చిక్కించుకొనె నాపె
తివిరి వింతసేయము దేవుళ్లము
చవులుగా మోవి ఇచ్చి చనవులు చూపె నాపె
ఇవల నేమైతే నీకు ఇచ్చకపు వారము
(॥ఆపె॥)
జంగిలి మాయలు సేసి జట్టిగొన(నె) నిన్ను నాపె
కంగువెట్టుకోము నేము గరితెలము
అంగవించి శ్రీ వేంకటాధిప నన్నుఁ గూడితి
సంగతి నీకు నేమైతే సతమైన వారము
(||pallavi||)
ābĕgu māgunu nem̐ḍu aṁtara mĕṁta
kām̐purālu verĕ verĕ kanugŏṁṭa gāga
(||ābĕ||)
māḍalamaṁdulu nūri marigiṁchugŏnĕ nābĕ
yīḍu vĕṭṭugomu nemu illāṁḍlamu
sīḍigi māḍigi nīdo siggulu vīḍīni nābĕ
kūḍamula nemaide guṭṭugalavāramu
(||ābĕ||)
sĕvilo maṁtrālu sĕppi se sikkiṁchugŏnĕ nābĕ
tiviri viṁtaseyamu devuḽlamu
savulugā movi ichchi sanavulu sūbĕ nābĕ
ivala nemaide nīgu ichchagabu vāramu
(||ābĕ||)
jaṁgili māyalu sesi jaṭṭigŏna(nĕ) ninnu nābĕ
kaṁguvĕṭṭugomu nemu garidĕlamu
aṁgaviṁchi śhrī veṁkaḍādhiba nannum̐ gūḍidi
saṁgadi nīgu nemaide sadamaina vāramu