ఆపెకేల సన్న సేసే వంతటిలోనె నే
(॥పల్లవి॥)
ఆపెకేల సన్న సేసే వంతటిలోనె నే-
నేపున నీ సుద్దులకు యెగ్గువట్టేనా
(॥॥)
తొల్లిటియలవాటున తొయ్యలి పిలిచెఁగాక
యెల్లవారు నుండుట యెఱుఁగునా
చల్లఁగా నీవిచ్చినచనవు మెరసెఁగాక
చిల్లరనీసేఁత గుట్టు సేయఁగ నేర్చునా
(॥॥)
యెప్పటివలెనంటానే యెదురుగా వచ్చెఁగాక
చొప్పులెత్తేసవతుల జూడవచ్చెనా
కప్పేమగఁడవుగాగా గాఁగిలించుకొనెఁగాక
తప్పకుండా నీమర్మాలు దాఁచి పెట్టనేర్చునా
(॥॥)
దోమతెర మరఁగంటా తూరి ఇంతి గూడెఁగాక
నీమై నలమేల్మంగ చెందిన దెంచెనా
ఆముక శ్రీవేంకటేశ ఆమాఁటాడెఁ గాక నిన్ను
నేమెల్లా నీయాండ్ల మవుత నిన్న మొన్న వినెనా
(||pallavi||)
ābĕgela sanna sese vaṁtaḍilonĕ ne-
nebuna nī suddulagu yĕgguvaṭṭenā
(||||)
tŏlliḍiyalavāḍuna tŏyyali pilisĕm̐gāga
yĕllavāru nuṁḍuḍa yĕṟum̐gunā
sallam̐gā nīvichchinasanavu mĕrasĕm̐gāga
sillaranīsem̐ta guṭṭu seyam̐ga nersunā
(||||)
yĕppaḍivalĕnaṁṭāne yĕdurugā vachchĕm̐gāga
sŏppulĕttesavadula jūḍavachchĕnā
kappemagam̐ḍavugāgā gām̐giliṁchugŏnĕm̐gāga
tappaguṁḍā nīmarmālu dām̐si pĕṭṭanersunā
(||||)
domadĕra maram̐gaṁṭā tūri iṁti gūḍĕm̐gāga
nīmai nalamelmaṁga sĕṁdina dĕṁchĕnā
āmuga śhrīveṁkaḍeśha āmām̐ṭāḍĕm̐ gāga ninnu
nemĕllā nīyāṁḍla mavuda ninna mŏnna vinĕnā