Aabedo ninniyum jeppe dadeṟamganu

ఆపెతో నిన్నియుఁ జెప్పే దదెఱఁగను
Language

(॥పల్లవి॥)
ఆపెతో నిన్నియుఁ జెప్పే దదెఱఁగను
తేపగాఁ దన గుణాలు తెలిసెఁగా నాకునూ

(॥॥)
జగడాలు మానెఁగా సరుస వెనకటివి
యెగసక్కే లింక నెట్ట యినఁ జేయనీ
నగితి నే నెఱఁగక నామగఁ డంటానే
పగవానివలె నింత పఱచే దెఱఁగనూ

(॥॥)
మోములు చూచితిమిగా మోనాన నిద్దరమును
ఆ మీఁదటి పనులు యెట్టయినాఁ గానీ
దోమటివీడె మిచ్చితిఁ దొల్లిటివలె నంటానే
వేమరు నేఁ దన కింత వేసటౌ తెఱఁగనూ

(॥॥)
మనసులు గరఁగేఁగా మదనకేలిలోన
ననుపు లన్నియును నే నడుపెఁ గానీ
వొనరి శ్రీ వేంకటేశుఁ డొక్క టైతి నంటానే
చెనకితి గోర నిది సిగ్గవు టెఱఁగనూ.

(||pallavi||)
ābĕdo ninniyum̐ jĕppe dadĕṟam̐ganu
tebagām̐ dana guṇālu tĕlisĕm̐gā nāgunū

(||||)
jagaḍālu mānĕm̐gā sarusa vĕnagaḍivi
yĕgasakke liṁka nĕṭṭa yinam̐ jeyanī
nagidi ne nĕṟam̐gaga nāmagam̐ ḍaṁṭāne
pagavānivalĕ niṁta paṟase dĕṟam̐ganū

(||||)
momulu sūsidimigā monāna niddaramunu
ā mīm̐daḍi panulu yĕṭṭayinām̐ gānī
domaḍivīḍĕ michchidim̐ dŏlliḍivalĕ naṁṭāne
vemaru nem̐ dana kiṁta vesaḍau tĕṟam̐ganū

(||||)
manasulu garam̐gem̐gā madanagelilona
nanubu lanniyunu ne naḍubĕm̐ gānī
vŏnari śhrī veṁkaḍeśhum̐ ḍŏkka ṭaidi naṁṭāne
sĕnagidi gora nidi siggavu ṭĕṟam̐ganū.