ఆపెపై బత్తి గలుత అందరు నెఱుఁగరా
(॥పల్లవి॥)
ఆపెపై బత్తి గలుత అందరు నెఱుఁగరా
యేపున మాకుఁ దోడై యిటు చెప్పరాదా
(॥ఆపప॥)
చెలి నెత్తవడి వోడి చిన్నఁబోయి వున్న దంటా
అలరి నీ వేల వుసు రనే విపుడు
వెలయఁ బాసిక చక్కవేయ నేరదంటాను
పొలుపు మిగిలి యాల పొగిలేవు నీవు
(॥ఆపప॥)
తరుణి సారెలుదాఁకి తల వంచుకొనె నంటా
బెరసి నీ వేల కడు బెండుపడేవు
పరగ నాపెమీఁద పందెము మోచె నంటా
సొరిది నీ వేల వచ్చి సూడువట్టే విపుడు
(॥ఆపప॥)
సకి యాటసరి వచ్చి సంతోసించుకొనే నంటా
మొకమున చిరునవ్వు మొలపించేవు
వెకలివై యిద్దరి శ్రీవేంకటేశ గెలిపించి
వొకరొకరిఁ గౌఁగిట నొనరించుకొనేవు
(||pallavi||)
ābĕbai batti galuda aṁdaru nĕṟum̐garā
yebuna māgum̐ doḍai yiḍu sĕpparādā
(||ābaba||)
sĕli nĕttavaḍi voḍi sinnam̐boyi vunna daṁṭā
alari nī vela vusu rane vibuḍu
vĕlayam̐ bāsiga sakkaveya neradaṁṭānu
pŏlubu migili yāla pŏgilevu nīvu
(||ābaba||)
taruṇi sārĕludām̐ki tala vaṁchugŏnĕ naṁṭā
bĕrasi nī vela kaḍu bĕṁḍubaḍevu
paraga nābĕmīm̐da paṁdĕmu mosĕ naṁṭā
sŏridi nī vela vachchi sūḍuvaṭṭe vibuḍu
(||ābaba||)
sagi yāḍasari vachchi saṁtosiṁchugŏne naṁṭā
mŏgamuna sirunavvu mŏlabiṁchevu
vĕgalivai yiddari śhrīveṁkaḍeśha gĕlibiṁchi
vŏgarŏgarim̐ gaum̐giḍa nŏnariṁchugŏnevu