ఆపె వల్ల వెలి తించుకంతా లేదు
(॥పల్లవి॥)
ఆపె వల్ల వెలి తించుకంతా లేదు
యేపునఁ జేసే సేవ విన్నియునుఁ జేసెను
(॥ఆపె॥)
సన్నలనే చూపదా సతి తా నుండేటి మేడ
కన్నులనే మొక్కదా కడలనుండి
విన్నవించదా వావి వేడుకతో నేకతాన
కన్నెను నీ వేలుకోని కద మింతేకాక
(॥ఆపె॥)
తామెరల వేయదా తలఁపించి తలఁపించి
మోము చూపి పొలయదా ముందర నిల్చి
సాముసేసి పెనఁగదా సరసమాడే నెపాన
కామించి చిత్త మెప్పుడు గరఁగీనోకాక
(॥ఆపె॥)
ఆకున వాసి చూపదా అట్టె తన విరహము
వాకుచ్చి చెప్పదా లోలో వలపెల్లాను
యీకడ శ్రీవేంకటేశ యీకె గూడితి వింతలో
నీ కరుణ కిట్టానే నిలిచెనోకాకా
(||pallavi||)
ābĕ valla vĕli tiṁchugaṁtā ledu
yebunam̐ jese seva vinniyunum̐ jesĕnu
(||ābĕ||)
sannalane sūbadā sadi tā nuṁḍeḍi meḍa
kannulane mŏkkadā kaḍalanuṁḍi
vinnaviṁchadā vāvi veḍugado negadāna
kannĕnu nī velugoni kada miṁtegāga
(||ābĕ||)
tāmĕrala veyadā talam̐piṁchi talam̐piṁchi
momu sūbi pŏlayadā muṁdara nilsi
sāmusesi pĕnam̐gadā sarasamāḍe nĕbāna
kāmiṁchi sitta mĕppuḍu garam̐gīnogāga
(||ābĕ||)
āguna vāsi sūbadā aṭṭĕ tana virahamu
vāguchchi sĕppadā lolo valabĕllānu
yīgaḍa śhrīveṁkaḍeśha yīgĕ gūḍidi viṁtalo
nī karuṇa kiṭṭāne nilisĕnogāgā